News July 20, 2024
ఆదిలాబాద్: ధరణి ఆపరేటర్లకు స్థానచలనం

ADB జిల్లా వ్యాప్తంగా 18 మంది ధరణి అపరేటర్లకు స్థానచలనం కల్పించారు. ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న ధరణి ఆపరేటర్లను ఎట్టకేలకు బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే ఆయా మండలాల తహశీల్దార్ కార్యాలయాల్లో చేరాలని ఆదేశించారు. కాగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కొందరిని సుదూర ప్రాంతాలకు బదిలీ చేస్తారని అంతా భావించినా.. పక్క మండలానికే కేటాయించడం చర్చనీయాంశంగా మారింది.
Similar News
News December 3, 2025
ADB: సీఎం రేవంత్ పర్యటనపైన ప్రగతి ఆశలు

సీఎం రేవంత్ రెడ్డి రేపు జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. సీఎం పర్యటనతో జిల్లా అభివృద్ధిపై ఆశలు చిగురిస్తున్నాయి. బాసర ఆలయం, కుంటాల జలపాతం, జైనథ్ టెంపుల్ అభివృద్ధిపై వరాల జల్లు కురిపిస్తారని జిల్లా ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, మౌలిక వసతులు, సమస్యలపై సీఎం స్పందిస్తే మేలు జరుగుతుందని పేర్కొంటున్నారు. ఇలా జిల్లాకి ఇంకేం కావాలో కామెంట్ చేయండి.
News December 3, 2025
ADB: నేటి నుంచి 3వ విడత నామినేషన్ల స్వీకరణ

ఆదిలాబాద్ జిల్లాలో మూడు విడతల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడో విడత నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. బోథ్ నియోజకవర్గంలోని తలమడుగు, బోథ్, సోనాల, బజార్హత్నూర్, నేరడిగొండ, గుడిహత్నూర్ మండలాల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. మొత్తం 151 పంచాయతీలు, 1,220 వార్డు సభ్యుల నామినేషన్ల కోసం 39 క్లస్టర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
News December 3, 2025
ఆదిలాబాద్: CM సభ.. పార్కింగ్ వివరాలు

ADB స్టేడియంలో రేపు జరిగే CM సభకు వచ్చేవారి కోసం పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు.
★టూ వీలర్ ప్రజలకు రామ్ లీలా మైదానం, సైన్స్ డిగ్రీ కళాశాల వద్ద పార్కింగ్ చేసుకోవాలి
★ఆటోలకు, కార్లకు డైట్ కళాశాల మైదానం
★వీఐపీలకు శ్రీ సరస్వతి శిశు మందిర్, టీటీడీ కళ్యాణమండపం
★నిర్మల్ నుంచి వచ్చే బస్సులు, భారీ వాహనాలు పిట్టలవాడ, మావల PS మీదుగా వెళ్లి తెలంగాణ రెసిడెన్షియల్ బాయ్స్ Jr కళాశాలలో పార్కింగ్ చేసుకోవాలి


