News April 24, 2024

ఆదిలాబాద్: నామినేషన్ దాఖలు చేసిన ఆత్రం సక్కు

image

ఆదిలాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా రిటర్నింగ్ అధికారి రాజర్షి షాకు నామినేషన్ పత్రాలను అందించారు. ఆయనతో పాటు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జోగురామన్న, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, కోవ లక్ష్మీ ఉన్నారు.

Similar News

News October 20, 2025

పోలీసు అమరవీరుల వారోత్సవాల షెడ్యూల్ ఇదే

image

జిల్లాలో అమరులైన పోలీసుల జ్ఞాపకార్థం నిర్వహించే ఫ్లాగ్ డే (పోలీసు అమరవీరుల దినోత్సవం) వారోత్సవాలను ఈ నెల 21 నుంచి 24 వరకు ఘనంగా నిర్వహించాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. 21న హెడ్ క్వార్టర్స్‌లో అమరవీరుల స్తూపం వద్ద కలెక్టర్, ఎస్పీ నివాళులర్పిస్తారు. 22న మెగా రక్తదానం, 23న ఓపెన్ హౌస్, సైకిల్ ర్యాలీ, 24న 2000 మంది విద్యార్థులతో 5కే రన్ ఉంటుంది.

News October 20, 2025

ADB: ​బీసీ విద్యార్థులకు శుభవార్త..!

image

బీసీ విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న మహాత్మా జ్యోతిబా ఫూలే విదేశీ విద్యానిధి పథకం దరఖాస్తు గడువు ఈ నెల 31 వరకు పొడిగించారు. విద్యార్థుల సౌలభ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీ సంక్షేమశాఖ అధికారులు తెలిపారు. అర్హులు సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించాలని కోరారు. గత గడువు 15తో ముగియగా.. పొడిగించినట్లు పేర్కొన్నారు.

News October 20, 2025

ADB: గుస్సాడీ వేషధారణలో అదరగొట్టిన బాలుడు

image

భీంపూర్ మండలంలోని వాడేగామ గ్రామానికి చెందిన మూడేళ్ల బాలుడు కాత్లే ఉమేష్ ఆదివాసీల గుస్సాడీ వేషధారణలో అదరగొట్టాడు. ఎంత ఆధునికత వచ్చినా, సంస్కృతిని కాపాడుకోవడంలో ఆదివాసీలు ముందున్నారని, ఈ బాలుడి రూపంలో వారసత్వం తరాలుగా ప్రవహిస్తోందని స్థానికులు కొనియాడారు. ఈ గుస్సాడీ వేషధారణ అందరినీ ఆకట్టుకుంది.