News July 31, 2024
ఆదిలాబాద్: నిజాయితీ చాటుకున్న ముగ్గురు చిన్నారులు

తమకు దొరికిన సెల్ ఫోన్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించి చిన్నారులు తమ నిజాయితీని చాటుకున్నారు. జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో ముగ్గురు చిన్నారులకు బుధవారం ఓ సెల్ఫోన్ దొరికింది. వెంటనే 1 టౌన్ పోలీసులకు అప్పగించారు. రాంనగర్ కాలనీకి చెందిన దేవిదాస్ ఫోన్ గా పోలీసులు గుర్తించారు. ఆయనను పిలిపించి ఎస్ఐ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో ఫోన్ అప్పగించారు. ఈ సందర్భంగా పోలీసులు, దేవిదాస్ చిన్నారులను అభినందించారు.
Similar News
News October 13, 2025
ఆదిలాబాద్‌లో బంగారు ధర రికార్డు

ఆదిలాబాద్ పట్టణ వెండి, బంగారు వర్తక సంఘం ధరలు ప్రకటించింది. 24 కారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రికార్డు స్థాయిలో రూ.1,30,500 గా నమోదైంది. అదేవిధంగా వెండి 10 గ్రాములకు రూ.1,850గా ఉంది. ఈ కొత్త ధరలు నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. బంగారం ధరల్లో పెరుగుదల కొనుగోలుదారులను ఆందోళనకు గురి చేస్తోంది.
News October 13, 2025
ఆదిలాబాద్‌లో రియాల్టీ ముఠా భారీ కుంభకోణం

ఆదిలాబాద్‌లో రియాల్టీ ముఠా భారీ కుంభకోణాన్ని బయట పట్టినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. సూర్య రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు చేసి దర్యాప్తు చేశామన్నారు. ఈడీ, ఎస్బీఐ మార్టగేజ్ అధీనంలో ఉన్న భూమిని కబ్జా చేసి బెదిరింపులకు పాల్పడిన ముఠాలో నిందితులు రమేష్ శర్మ, ఇబ్రహీం మహమ్మద్ అరెస్టు చేశామన్నారు. అదేవిధంగా యతేంద్రనాథ్, హితేంద్రనాథ్, రాకేష్, మనోజ్ కుమార్, పూనం, అనుపమ, శివాజీపై కేసు చేశామన్నారు.
News October 12, 2025
ఆదిలాబాద్‌లో బడా రియాల్టర్లపై కేసు

భూ కబ్జా కేసులో చిన్న పెద్ద అనే తేడా లేకుండా తప్పు చేసిన భూకబ్జా దారులందరిపై కేసులు నమోదు అవుతున్నాయి. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వచ్చాక రియల్టర్‌ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తాజాగా ఎస్.బి.ఐ బ్యాంకు అధీనంలోని భూమిని కబ్జా చేసిన ఘటనలో ఆదిలాబాద్‌కు చెందిన మామ్లా సెట్, రమేశ్ శర్మతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.