News March 10, 2025

ఆదిలాబాద్, నిర్మల్‌కు మొండిచేయి

image

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌కు నిధులు మంజూరు చేస్తూ Dy.CM భట్టి విక్రమార్క ఉత్తర్వులు విడుదల చేశారు. సువిశాల స్థలంలో ఇంటర్నేషనల్ స్థాయి విద్యకు దీటుగా నిర్మిస్తున్నామని తెలిపారు. ఇక్కడి విద్యార్థులు ప్రపంచంతో పోటీపడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్‌కు రూ.200కోట్లు, మంచిర్యాలకు రూ.600 కోట్లు మంజూరుకాగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు ఎలాంటి కేటాయింపులు చేయలేదు.

Similar News

News October 26, 2025

RTC, ప్రైవేట్ బస్సులకు తేడా ఏంటి?

image

ఆర్టీసీలో ట్రైనింగ్ తీసుకున్న డ్రైవర్లు ఉంటారు. డ్యూటీకి ముందు ప్రతి డిపోలో ఆల్కహాల్ టెస్టు చేస్తారు కాబట్టి మద్యం తాగి బస్సు నడిపే అవకాశం ఉండదు. బస్సుకు స్పీడ్ లాక్ ఉండటంతో గంటకు 80 కి.మీ. వేగాన్ని దాటి వెళ్లలేదు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ప్రైవేట్ బస్సు డ్రైవర్లు రాత్రి వేళ్లలో గంటకు 120 కి.మీ. వేగంతో వెళ్తారు. డ్రైవింగ్ చేసేటప్పుడు మద్యం తాగే అవకాశమూ ఉంది.

News October 26, 2025

రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు

image

కడప జిల్లాలో అధిక వర్షపాతం కృషి అవకాశం ఉన్నందున సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించవలసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి రాకూడదని తెలిపారు. వృద్ధులు మహిళలు వికలాంగులు రావద్దని అన్నారు.

News October 26, 2025

DRDOలో ‌ఇంటర్న్‌షిప్ చేయాలనుకుంటున్నారా?

image

<>DRDO <<>>అనుబంధ సంస్థ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్ డెవలప్‌మెంట్ అండ్ ఇంటిగ్రేషన్ సెంటర్ (CASDIC) 30 ఇంటర్న్‌షిప్‌ల కోసం దరఖాస్తులు కోరుతోంది. BE, బీటెక్, MSc ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. నెలకు స్టైపెండ్ రూ.5వేల చొప్పున 6నెలలు చెల్లిస్తారు. hrd.casdic@gov.in ఇమెయిల్ ద్వారా NOV 10 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 25ఏళ్ల లోపు ఉండాలి. వెబ్‌సైట్: https://www.drdo.gov.in/