News July 20, 2024
ఆదిలాబాద్: నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు

◆ ఉమ్మడి జిల్లాలో దంచికొట్టిన వాన
◆ లోకేశ్వరం: పేకాట ఆడుతున్న ఆరుగురు అరెస్ట్
◆ MNCL: రైలుకింద పడి యువకుడు మృతి
◆ భీమిని : మద్యం మత్తులో తల్లిపై దాడి
◆ బెల్లంపల్లి : గుండెపోటుతో ప్రభుత్వ పిఈటి మృతి
◆ కన్నెపల్లి : ఉరేసుకుని వ్యక్తి మృతి
◆ NRML : కడెం ప్రాజెక్టు మూడుగేట్లు ఎత్తివేత
◆ పరవళ్లు తొక్కుతున్న జలపాతాలు
◆ ఆదిలాబాద్ : పోలీసులమంటూ బురిడీ
◆ మంచిర్యాల: MLAపై అసత్య ప్రచారం.. ముగ్గురు అరెస్ట్
Similar News
News October 14, 2025
ఆదిలాబాద్లో బంగారం రికార్డు ధర.!

బంగారం పేదవాడికి అందని ద్రాక్షగా మారనుందా.? అంటే వాటి గణాంకాలు చూస్తే అవుననే అనిపిస్తుంది. గత కొన్ని నెలలుగా పసిడి రేటు జెట్ స్పీడ్లో దూసుకుపోతుంది. ఈరోజు మంగళవారం బంగారం ధర మార్కెట్లో తులానికి రూ.1,31,500 పలికి ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. పసిడి రేటును చూసి సాధారణ ప్రజలు బెంబలెత్తిపోతున్నారు.
News October 14, 2025
ADB: ‘పోలీస్ ఫ్లాగ్ డే’ షార్ట్ ఫిల్మ్, ఫొటోల ఆహ్వానం: ఎస్పీ

పోలీస్ ఫ్లాగ్ డే (అమరవీరుల దినోత్సవం) సందర్భంగా అక్టోబర్ 21న నిర్వహించే కార్యక్రమాల కోసం వివిధ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పోలీసుల కీర్తి ప్రతిష్ఠలు, సేవలను పెంపొందించే అంశాలపై 3 నిమిషాలకు తగ్గకుండా షార్ట్ వీడియోలను, అలాగే పోలీసులు అందించిన సేవల ఫొటోలను రూపొందించి ఈ నెల 23 లోగా జిల్లా పోలీస్ కార్యాలయంలో అందించాలని ఆయన సూచించారు.
News October 14, 2025
ADB: 2 వారాలు.. 26 మోసాలు.. మీరూ జాగ్రత్త..!

ఇచ్చోడ మండల కేంద్రం నుంచి ఒకరు ట్రాన్స్ఫోర్ట్ కావాలని ఆన్లైన్లో వెతకగా నకిలీ కస్టమర్ కేర్ వ్యక్తులు బాధితున్ని సంప్రదించారు. ఆదిలాబాద్ రూరల్ మండలానికి చెందిన ఒక వ్యక్తికి కేరళ లాటరీ రూ.5 లక్షలు వచ్చిందంటూ సైబరాసురులు మోసాలకు పాల్పడ్డారు. జిల్లాలో 2వారాల వ్యవధిలో 26మోసాలు జరిగాయంటే అమాయకులు ఎలా మోసపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. మోసపోతే వెంటనే 1930కి కాల్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.