News January 31, 2025
ఆదిలాబాద్: నేడు విద్యా సంస్థలకు సెలవు

ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతరలో భాగంగా ప్రజా దర్బార్‌ను పురస్కరించుకొని నేడు (శుక్రవారం) విద్యాసంస్థలకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా సెలవు ప్రకటించారు. ఈ సెలవు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ సెలవు మార్చి 8న పని దినంగా పరిగణించాలని సూచించారు. పరీక్షలు జరిగే ఇంటర్ కళాశాలలకు ఈ సెలవు వర్తించదని కలెక్టర్ స్పష్టం చేశారు.
Similar News
News February 19, 2025
బజార్హత్నూర్‌లో మృతదేహం లభ్యం

బజార్హత్నూర్ మండలంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. మండలంలోని కడెం వాగులో బుధవారం ఓ శవం లభ్యం కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతుడి హత్యా? లేక ఆత్మహత్యా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
News February 19, 2025
ADB: అప్పుల బాధతో రైతు సూసైడ్

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పార్టీ(కే) గ్రామానికి చెందిన బోడగిరి రాజు(40) తన 3 ఎకరాల భూమితో పాటు మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకొని పంట సాగు చేశాడు. అనుకున్న మేర పంట దిగుబడి రాలేదు. రుణమాఫీ కూడా కాకపోవడంతో అప్పు ఎట్లా తీర్చాలో అని మనస్తాపం చెంది పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
News February 19, 2025
ADB: కాంగ్రెస్ ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటుందా..?

ఉమ్మడి ADB, KNR, NZB, MDK పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్లీ గెలుస్తుందా అని రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి జీవన్‌రెడ్డి గెలిచారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి ‘అల్ఫోర్స్’ అధినేత నరేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవడానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది.