News July 15, 2024
ఆదిలాబాద్-పటాన్చెరు రైల్వే లైన్ సర్వే

ఆదిలాబాద్-పటాన్చెరు రైల్వేలైన్ సర్వే పనులు సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలో NH-161 వెంట నిర్వహించారు. నిర్మల్, బాల్కొండ, బాన్సువాడ మీదుగా పటాన్‌చెరుకు లైన్ వేయనున్నారు. మొత్తం 317KM రైల్వేలైన్ ఏర్పాటుకు ద.మ రైల్వే అప్పట్లో రూ.5,700 కోట్లు మంజూరు చేసింది. ఇందులో భాగంగా 2వ విడత సర్వే చేస్తున్నారు. దీనికి 12ఏళ్ల క్రితం సర్వే చేయగా.. తిరిగి అదే మార్గంలో సర్వే చేసి గుర్తులు వేస్తున్నారు.
Similar News
News December 7, 2025
NZB: 2వ విడతలో 38 గ్రామాల సర్పంచ్‌లు ఏకగ్రీవం

2వ విడత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 38 గ్రామాల సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అధికారులు తెలిపారు. ధర్పల్లి మండలంలో 6, డిచ్పల్లి మండలంలో 7, ఇందల్ వాయి, NZB రూరల్ మండలాల్లో 4 చొప్పున, మాక్లూర్ మండలంలో 7, మోపాల్ మండలంలో 1, సిరికొండ మండలంలో 6, జక్రాన్ పల్లి మండలంలో 3 గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు. మిగిలిన 158 సర్పంచ్ పదవుల కోసం 587 మంది బరిలో నిలిచారన్నారు.
News December 7, 2025
NZB:16 కిలోమీటర్ల LT కండక్టర్ వైరు చోరీ

నిజామాబాద్ శివారులోని గూపన్పల్లి ప్రాంతంలో TSNPDCLకు సంబంధించిన LT కండక్టర్ వైర్‌ను దుండగులు దొంగిలించినట్లు రూరల్ SHO శ్రీనివాస్ తెలిపారు. అశోక వెంచర్ LOB ఎలక్ట్రిసిటీ అధికారులు పరిశీలించగా SS 55/25 నుంచి SS 56/25 వరకు KVDRల నుంచి సుమారు 16 కిలోమీటర్ల LT కండక్టర్ వైర్‌ను కత్తిరించినట్లు గుర్తించారు. దీంతో ఎలక్ట్రిసిటీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SHO పేర్కొన్నారు.
News December 6, 2025
స్ట్రాంగ్ రూమ్‌ను తనిఖీ చేసిన NZB కలెక్టర్

NZB సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఎన్నికల సామగ్రిని భద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్‌ను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శనివారం తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు పంపిస్తున్న పోలింగ్ మెటీరియల్ గురించి అడిగి తెలుసుకున్నారు. సామగ్రి తరలింపు విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జడ్పీ సీఈవో సాయగౌడ్ పాల్గొన్నారు.


