News October 19, 2024
ఆదిలాబాద్: పత్తి కొనుగోళ్లపై సందేహాలు ఉన్నాయా…? అయితే..
ADB జిల్లాలోని పత్తి కొనుగోళ్లలోని రైతుల సమస్యలు/ సందేహాలు/ ఫిర్యాదులకై వివిధ శాఖల సమన్వయంతో మల్టి డిసిప్లినరీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు.1) వ్యవసాయ శాఖ కార్యాలయ విస్తరణ అధికారి ప్రసాద్ -9014208626, 2) వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం- జె. స్వామి – 78935866723) సీసీఐ కార్యాలయ ప్రవీణ్ – 90107809734) లీగల్ మెట్రాలజీ నవీన్ కుమార్ 8247767144కు సంప్రదించాలన్నారు.
Similar News
News November 12, 2024
ADB: KU పరీక్షల షెడ్యూల్ విడుదల
కాకతీయ యూనివర్సిటీలోని డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్‌ను KU అధికారులు మంగళవారం విడుదల చేశారు. 1, 5 సెమిస్టర్ విద్యార్థులకు ఈ నెల 26 నుంచి, 3వ సెమిస్టర్ విద్యార్థులకు ఈ నెల 27 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 1, 5వ సెమిస్టర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2 – 5 గంటల వరకు, 3వ సెమిస్టర్ వారికి ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు.
News November 12, 2024
జిల్లాకు వచ్చిన ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి
ఆదిలాబాద్ జిల్లాకు ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి కృష్ణ ఆదిత్య విచ్చేశారు. ముందుగా ఉట్నూర్‌లో ఆయన పర్యటించగా ITDA PO ఖుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్ శ్యామలదేవి దేవి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం అక్కడ జరుగుతున్న కుటుంబ సర్వేను పరిశీలించారు. అలాగే ఉట్నూర్ మండలం బిర్సాయిపేటలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను పరిశీలించారు. కార్యక్రమంలో అధికారులు ఉన్నారు.
News November 12, 2024
లోకేశ్వరం: సమగ్ర సర్వేని బహిష్కరించిన ధర్మోరా గ్రామస్థులు
వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ లోకేశ్వరం మండలం ధర్మోరా గ్రామస్థులు మంగళవారం సమగ్ర కుటుంబ సర్వేను బహిష్కరించారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే సమగ్ర సర్వేకు సహకరించమని చెప్పారు.