News August 12, 2024
ఆదిలాబాద్: పరీక్షల్లో మెరిసిన శుభాంగి
ఆదిలాబాద్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల BZC విద్యార్థిని శుభాంగి అగర్వాల్ సీపీ గెట్ పీజీ ఫలితాల్లో ఏకంగా ఏడు సబ్జెక్టుల్లో ఉత్తమ ర్యాంకులు సాధించి చరిత్ర సృష్టించింది. వృక్షశాస్త్రంలో 6వ ర్యాంకు, హిందీలో 25, జంతు శాస్త్రంలో 27, ఆంగ్లంలో 57, జర్నలిజంలో 107, ఆర్థిక శాస్త్రంలో 117, రసాయన శాస్త్రం లో 1713 ర్యాంకులు సాధించి ఔరా అనిపించింది. సోమవారం కళాశాలలో శుభాంగిని, తండ్రిని సన్మానించారు.
Similar News
News September 16, 2024
మంగళవారం మంచిర్యాల కలెక్టరేట్‌లో ప్రజాపాలన దినోత్సవం
మంచిర్యాల కలెక్టరేట్‌లో మంగళవారం ప్రజా పాలన దినోత్సవం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఉదయం 10 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు హర్కర వేణుగోపాల్ రావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని వెల్లడించారు.
News September 15, 2024
ఆసిఫాబాద్: భర్త మందలించడంతో భార్య ఆత్మహత్య
భర్త మందలించినందుకు భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆసిఫాబాద్ మండలంలో ఆదివారం చోటు చేసుకుంది.. CI సతీష్ కుమార్ వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్ మండలం అడ గ్రామానికి చెందిన గంగుబాయితో అదే గ్రామానికి చెందిన హుడే లక్ష్మణ్ తో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. భార్య బట్టలు ఉతకడానికి బయటకు వెళ్లి ఇంటికి లేటుగా వచ్చినందుకు భర్త మందలించడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
News September 15, 2024
‘NCC శిక్షణను కెడెట్లు సద్వినియోగం చేసుకోవాలి’
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్ లో NCC సీఏటీసీ-7 శిక్షణ శిబిరం ఆదివారం ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లాకు చెందిన 600 మంది కెడెట్లు ఈ శిక్షణ శిబిరానికి హాజరయ్యారు. జిల్లా NCC కమాండింగ్ అధికారి కల్నల్ వికాస్ శర్మ మాట్లాడుతూ.. ఈనెల 23వ తేదీ వరకు ఈ శిబిరం కొనసాగుతుందని తెలిపారు. క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సైనికులకు ఇచ్చే తరహాలో శిక్షణ తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు.