News May 18, 2024
ఆదిలాబాద్ పార్లమెంట్‌లో ఎవరు గెలిచిన చరిత్రే..!
ADB పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఈసారి చరిత్రలో నిలిచిపోనున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలిస్తే ADB స్థానంలో MP అయినా మొదటి మహిళగా, పోటీచేసిన మొదటిసారే గెలిచిన నేతగా చరిత్ర సృష్టిస్తారు. 20 ఏళ్ల నుంచి అక్కడ ఏ పార్టీకి వరుసగా రెండోసారి గెలవలేదు. BJP అభ్యర్థి నగేశ్ గెలిస్తే ఆ రికార్డు బ్రేక్ అవుతుంది. BRS అభ్యర్థి గెలిస్తే 2 సార్లు MLAగా గెలిచి MP అయిన వ్యక్తిగా ఆత్రం సక్కు నిలుస్తారు.
Similar News
News December 7, 2024
ఆదిలాబాద్: ‘సోమవారం నుంచి ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రారంభించాలి’
వచ్చే సోమవారం నుండి ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రారంభించాలని, గడువులోగా పూర్తి చేయాలనీ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం కలెక్టరేట్ లో ఇందిరమ్మ ఇళ్ల సర్వే పై గూగుల్ మీట్ ద్వారా సంబంధిత అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారుల గుర్తింపు కోసం ప్రభుత్వం రూపొందించిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్ యాప్ ద్వారా సర్వే నిర్వహించాల్సిన విధానంపై దిశానిర్దేశం చేశారు.
News December 7, 2024
ADB: రేవంత్ రెడ్డి ఏడాది పాలన పై REPORT
రేవంత్ రెడ్డి CMగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా ఏడాది. కాగా ఇప్పటి వరకు ఉమ్మడి ADB జిల్లాలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు, కుప్టీ, తుమ్మిడిహెట్టిలో ప్రాజెక్ట్ నిర్మాణం, కడెం ప్రాజెక్ట్ మరమ్మతుల కోసం నిధులు మంజూరు, సిమెంట్ ఫ్యాక్టరీ తెరిపిస్తామన్నారు. కాగా ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిపై మీ కామెంట్?
News December 7, 2024
నిర్మల్: బాలశక్తి కార్యక్రమాన్ని నిరంతరం పకడ్బందీగా కొనసాగించాలి: కలెక్టర్
బాలశక్తి కార్యక్రమాన్ని నిరంతరం పకడ్బందీగా కొనసాగించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బాలశక్తి కార్యక్రమంపై సంబంధిత అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. బాలశక్తి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లోని విద్యార్థులకు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి, అన్ని రకాల పరీక్షలను నిర్వహించాలన్నారు.