News April 7, 2025

ఆదిలాబాద్ పాలిటెక్నిక్‌లో 12న పూర్వ సమ్మేళనం

image

ఈనెల 12న ఆదిలాబాద్ సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాల చరిత్రలలో మొదటిసారిగా 1980 నుంచి అన్ని బ్యాచులకు పూర్వ సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం కళాశాలలో సమ్మేళనానికి సంబంధించి సమావేశాన్ని ప్రిన్సిపాల్ రాంబాబు అధ్యక్షతన నిర్వహించగా అందుబాటులో ఉన్న అల్యూమ్ని మెంబర్స్ పాల్గొన్నారు. కార్యక్రమం జరిపించడానికి కార్యాచరణ జరిపి అడహాక్ కమిటీని ఎన్నుకోగా సమ్మేళనం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Similar News

News November 10, 2025

ఆదిలాబాద్: PGలో స్పాట్ అడ్మిషన్లు

image

ADB పట్టణంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో పీజీ స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.జే సంగీత, పీజీ కోఆర్డినేటర్ డా. రాజ్ కుమార్ తెలిపారు. తుది విడత పీజీ అడ్మిషన్లలో బోటనీలో 40, జువాలజీలో 56 అడ్మిషన్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. స్పాట్ అడ్మిషన్‌లో సీటు వచ్చిన వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదని పేర్కొన్నారు.

News November 10, 2025

తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర కార్యదర్శిగా ఆదిలాబాద్ వాసికి చోటు

image

తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర కార్యదర్శిగా ఆదిలాబాద్ మాజీ కౌన్సిలర్, బీజేపీ ఫ్లోర్ లిడర్ బండారి సతీష్‌కు చోటు లభించింది. రాష్ట్ర కార్యవర్గం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఉద్యమకారుల ఆత్మ గౌరవం, సంక్షేమం కోసం కృషి చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు డా.చీమ శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాకాల రామచందర్ బండారి సతీష్‌ను ఆదేశించారు.

News November 10, 2025

ఆదిలాబాద్: పత్తి, సోయా కొనుగోలు పరిమితిని పెంచాలి

image

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పత్తి, సోయా కొనుగోళ్ల పరిమితిని పెంచి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఎమ్మెల్యేలు రామారావు పటేల్, పాయల్ శంకర్ కోరారు. హైదరాబాద్‌లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావ్‌కు వినతిపత్రం అందజేశారు. సోయా ఎకరాకు 6 నుంచి 7.60 క్వింటాళ్లు, సీసీఐ ద్వారా పత్తిని ఎకరాకు 7 నుంచి 12 క్వింటాళ్లకు పెంచి కొనుగోలు చేయాలని కోరారు.