News April 14, 2025
ఆదిలాబాద్: పిల్లలపై నిరంతరం అప్రమత్తంగా ఉండండి

మరికొద్ది రోజుల్లో విద్యార్థులకు 2 నెలల వేసవి సెలవులు రానున్నాయి. దీంతో పిల్లలు నదులు, చెరువుల్లో ఈత కొట్టడానికి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకునే అవకాశం ఉంది. కనుక తల్లిదండ్రులు పిల్లల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. వారిపై ఎప్పటికీ అప్పుడు నిఘా ఉంచాలి. అలాగే ఎండలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలు బయటకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
Similar News
News October 26, 2025
NPA, స్త్రీ నిధిపై ADB కలెక్టర్ రాజర్షి షా సమీక్ష

ఆదిలాబాద్ కలెక్టరేట్లో APM, DPMలతో జిల్లా కలెక్టర్ రాజర్షి షా సమీక్షా సమావేశం నిర్వహించారు. బ్యాంకు లింకేజి, NPAల తగ్గింపు, ఇందిరమ్మ లబ్ధిదారులకు ఆర్థిక సహాయం, స్త్రీ నిధి పురోగతిపై ప్రధానంగా చర్చించారు. కౌమార సభ్యుల గుర్తింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, డీఆర్డీఓ రవీందర్ రాథోడ్, ఎల్డీఎం ఉత్పల్ కుమార్ పాల్గొన్నారు.
News October 26, 2025
ఈ నెల 27న ఆదిలాబాద్లో జాబ్ మేళా

ఆదిలాబాద్ జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 27న ఉదయం 10:30 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మిల్కా తెలిపారు. అర్హులైన 17 నుంచి 25 ఏళ్ల పురుష అభ్యర్థులు (BSC/B.Com/B.A/M.P.C/B.i.P.C/MLT) ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9154679103, 9963452707 నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.
News October 26, 2025
పెద్దపులి తిరిగి తిప్పేశ్వర్ కు వరకు వెళ్లిందా..!

కొన్ని రోజుల క్రితం బోథ్ మండలాన్ని గడగడలాడించిన పెద్దపులి ఆనవాళ్లు కనిపించడం లేదు. అది తిరిగి తన సొంతగూడు మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అటవీ ప్రాంతానికి వెళ్లిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత కొన్ని రోజుల క్రితం నిగిని, మర్లపల్లి అడవిలో కనిపించినట్లు అటవీ అధికారులు ధృవీకరించిన విషయం తెలిసిందే. అయితే ఈమధ్య దాని ఆనవాళ్లు కనబడడం లేదు.


