News February 13, 2026

ఆదిలాబాద్: పుర ‘పోరు’.. నేడే ఫలితాలు

image

తెలంగాణ వ్యాప్తంగా ఈనెల 11న జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్‌ ఫలితాలు నేడు వెలువడనున్నాయి. కౌంటింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్‌తో పాటు ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, ఖానాపూర్, బెల్లంపల్లి, చెన్నూర్, క్యాతన్‌పల్లి, లక్షెట్టిపేట, ఆసిఫాబాద్, కాగజ్ నగర్ మున్సిపాలిటీలకు సంబంధించి కౌంటింగ్ జరగనుంది. ఫలితాల కోసం Way2Newsను ఫాలో అవ్వండి.

Similar News

News March 12, 2026

NZB: డిగ్రీ విద్యార్థినులకు కలెక్టర్ పాఠాలు

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారంలో ఉన్న ప్రభుత్వ గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల
డిగ్రీ విద్యార్థినులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి కొద్దిసేపు వివిధ అంశాలపై బోధించారు. గురువారం కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాగా చదువుకొని ఉన్నత విద్యను పూర్తి చేసుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సూచించారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ దశలో చదువును ఆపకూడదన్నారు.

News March 12, 2026

NGKL: రేపు మెగా జాబ్ మేళా

image

NGKL జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ పీజీ (ఆర్ట్స్ అండ్ కామర్స్) కళాశాలలో రిలయన్స్ ఫౌండేషన్ వారి సహకారంతో డిజిటైర్డ్, గేబ్స్, రైటర్ మొదలైన కంపెనీల సహకారంతో రేపు శుక్రవారం ఉదయం 10 గంటలకు ఉద్యోగమేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.కె.గీతాంజలి ఒక ప్రకటన ద్వారా తెలిపారు. అనంతరం నిరుద్యోగులు https://forms.gle/NNv9V9tEcPDtTVaW6 లింక్ ద్వారా నేడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

News March 12, 2026

భద్రాచలం. ‘శ్రీరామనవమి వేడుకలు.. బస్సులు కొరత ఉండొద్దు’

image

భద్రాచలం ఐటీడీఏ గిరిజన భవన్‌లో శ్రీరామనవమి వేడుకలపై TSRTC సమీక్ష సమావేశం జరిగింది. కరీంనగర్ డిపో మేనేజర్ సాల్మన్ ముఖ్య అథితిగా పాల్గొని మాట్లాడుతూ.. ఈ నెల 27, 28న స్వామివారి కళ్యాణానికి భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉందన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా సకాలంలో బస్సులు నడపాలని సూచించారు. సమావేశంలో భద్రాచలం డిపోతో పాటు ఆరు డిపోల మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు.