News September 6, 2024
ఆదిలాబాద్: పోలీసుల గుప్పిట్లో ఏజెన్సీ
జైనూర్‌లో జరిగిన ఘర్షణతో జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జైనూర్‌ను పూర్తిగా అదుపులోకి తీసుకొని కొత్తవారిని రానివ్వకుండా జాగ్రత్తపడుతున్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ మీదుగా వెళ్లే బస్సులను రద్దు చేశారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు అడిషనల్ DG మహేశ్ భగవత్, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, SP గౌష్ ఆలం, SP శ్రీనివాసరావు, ఇతర అధికారులతో చర్చలు జరిపారు.
Similar News
News September 16, 2024
రేపు ADBలో మద్యం దుకాణాలు మూసివేత
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈనెల 17న మంగళవారం మద్యం దుకాణాలను మూసి వేయనున్నట్లు ఎక్సైజ్ సీఐ విజేందర్ తెలిపారు. పట్టణంలో మంగళవారం వినాయక నిమజ్జనం శోభాయాత్రను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. మద్యం వ్యాపారులు ఎవరైనా ఈ సమయాల్లో విక్రయాలు జరిపితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. తిరిగి బుధవారం యథావిధిగా దుకాణాలు తెరుస్తారని పేర్కొన్నారు.
News September 16, 2024
భైంసా: భార్య ఆత్మహత్యాయత్నం.. ఉరేసుకొని భర్త మృతి
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన భైంసాలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ వివరాల ప్రకారం.. దెగాంకు చెందిన ఎర్రన్న(40) మద్యానికి బానిసై భార్య హంసతో గొడవకు దిగాడు. ఆమె మనస్తాపంతో పురుగు మందు తాగింది. కుటుంబీకులు భైంసా ఏరియాస్పత్రికి తరలించారు. కాగా చికిత్సపొందుతున్న భార్యతో మరోసారి గొడవపడి ఇంటికి వెళ్లి
ఎర్రన్న ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.
News September 16, 2024
మంగళవారం మంచిర్యాల కలెక్టరేట్‌లో ప్రజాపాలన దినోత్సవం
మంచిర్యాల కలెక్టరేట్‌లో మంగళవారం ప్రజా పాలన దినోత్సవం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఉదయం 10 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు హర్కర వేణుగోపాల్ రావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని వెల్లడించారు.