News July 18, 2024
ఆదిలాబాద్: ప్రజాపాలన సేవాకేంద్రం ప్రారంభం
ప్రజాపాలన ఆరు గ్యారంటీల అమలులో భాగంగా గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలు రాని దరఖాస్తుదారులు ప్రజాపాలన సేవా కేంద్ర ద్వారా డేటా సవరణ చేసుకోవచ్చని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. గురువారం కలెక్టరేట్ లో సీపీవో కార్యాలయంలో ప్రజాపాలన సేవా కేంద్రం ప్రారంభించారు. సవరణ కొరకు రేషన్ కార్డ్, ఆధార్ కార్డు, విద్యుత్ సర్వీస్ కనెక్షన్ నెంబర్, గ్యాస్ కనెక్షన్ నెంబర్, ఎల్పిజి కస్టమర్ ఐడి తీసుకెళ్ళలని సూచించారు.
Similar News
News January 14, 2025
కెరమెరి అటవీ ప్రాంతంలో రెండు చిరుత పులుల సంచారం
కెరమెరి రేంజ్ పరిధిలోని నిశాని, ఇందాపూర్, కరంజీ వాడ అటవీ ప్రాంతంలో రెండు చిరుత పులుల సంచారంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే కెరమెరి మండలంలోని కారంజీ వాడ,నిషానీ, ఇందాపూర్ అటవీ ప్రాంతంలో సోమవారం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ట్రాక్ కెమెరాకు చిక్కాయని కేరమేరీ రేంజ్ అధికారి మజారుద్దీన్ తెలిపారు.. దీంతో అటవీ సమీపంలోని గ్రామల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు..
News January 14, 2025
44 నేషనల్ హైవేపై యాక్సిడెంట్ యువకుడి మృతి
బాల్కొండ మండలం చిట్టాపూర్ వద్ద నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బైక్ను ఢీకొట్టడంతో బైక్పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి స్వగ్రామం నిర్మల్ జిల్లా బొప్పారం అని బాల్కొండ ఎస్ఐ నరేష్ తెలిపారు. పండగ వేళ తీవ్ర విషాదమని, అత్యంత వేగంగా వెళ్ళడమే ప్రమాదానికి కారణమని ఎస్ నరేష్, ఏఎస్ఐ శంకర్ తెలిపారు.
News January 14, 2025
రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్లో దస్తూరాబాద్ విద్యార్థి ప్రతిభ
కోదాడలో జరిగిన రాష్ట్ర స్థాయి ఓపెన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్-2025లో నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ ZHS విద్యార్థి కొట్టే అభిషేక్ ప్రతిభ చాటి మూడు పతకాలు గెలుచుకున్నాడు. ఇందులో 102 కేజీ కేటగిరి యూత్ విభాగంలో సిల్వర్, జూనియర్ విభాగంలో సిల్వర్, సీనియర్ విభాగంలో బ్రాంజ్ మెడల్లను సాధించాడు. అభిషేక్ను HM వామాన్ రావ్, PET నవీన్ అభినందించారు.