News July 16, 2024

ఆదిలాబాద్: భార్యను దారుణంగా చంపిన భర్త.. కారణమిదే.!

image

<<13633463>>భార్యను చంపి <<>>భర్త ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన బేలలో జరిగిన విషయం తెలిసిందే. సైద్‌పూర్‌కి చెందిన లక్ష్మణ్(32), బోరిగాంకు చెందిన సునీత(28)ను 9ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు. సునీతకు అక్రమసంబంధం ఉందని గొడవపడటంతో ఆమె కొన్ని పుట్టింటికి వెళ్లిపోయింది. సోమవారం పిల్లల టీసీ కోసం గ్రామానికి వచ్చిన ఆమెను లక్ష్మణ్ కత్తితో దారుణంగా గొంతు కోసి చంపినట్లు DSP జీవన్ రెడ్డి తెలిపారు.

Similar News

News October 16, 2024

మంచిర్యాల MLA ఇంట్లోకి చొరబడిన దుండగులు

image

మంచిర్యాల పట్టణంలోని MLA ప్రేమ్ సాగర్ రావు ఇంట్లోకి ముగ్గురు దుండగులు చొరబడిన ఘటన కలకలం రేపింది. పట్టణ సీఐ బన్సీలాల్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ముఖానికి ముసుగు ధరించి రాముని చెరువు కట్ట మీదుగా MLA
ఇంట్లో ప్రవేశించారు. అక్కడ ఉన్న వాచ్‌మెన్‌పై దాడి చేయబోగా అతడు అప్రమత్తమై కేకలు వేయడంతో పారిపోయారు. చొరబడిన వ్యక్తులు మారణాయుధాలతో వచ్చినట్లు వాచ్ మెన్ తెలిపారు.

News October 16, 2024

ADB: త్వరలో బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ: మంత్రి సీతక్క

image

చాలకాలంగా పెండింగ్లో ఉన్న ఆదిలాబాద్, నిజామాబాద్ సహా అన్ని జిల్లాల్లో అన్ని శాఖల బ్యాక్‌లాగ్ పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీపై కసరత్తు జరుగుతోందని HYD సెక్రటేరియట్ సమావేశంలో పేర్కొన్నారు. మహిళా సంక్షేమ శాఖలో 10 మందికి అపాయింట్​ మెంట్​ లెటర్స్​ అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి కరుణ, తదితరులు పాల్గొన్నారు.

News October 16, 2024

గాదిగూడ ఎస్ఐ మహేశ్‌పై కేసు నమోదు

image

రోడ్డు ప్రమాదానికి కారణమైన గాదిగూడ ఎస్ఐ మహేశ్‌పై కేసు నమోదైంది. వివరాలు ఇలా.. ఈ నెల 11న లోకారి గ్రామం వద్ద షేక్ అతిఖ్ అనే వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా SI తన కారుతో ఢీకొట్టాడు. ఈ ఘటనలో అతిఖ్‌కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో అతని కుటుంబీకులు శనివారం ఆదిలాబాద్ ఎస్పీ క్యాంపు కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. న్యాయం చేయాలని కోరారు. సోమవారం నార్నూర్ సీఐ రహీం పాషాకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.