News April 13, 2024
ఆదిలాబాద్: మరో మూడు రోజులే..!

ఉమ్మడి ADB జిల్లాలో పది నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే గత ఫిబ్రవరి 8న ఓటరు తుది జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో ADB లోక్ సభ పరిధిలోని 2111 పోలింగ్ కేంద్రాలలో 16,44,715 మంది ఓటర్లకు చోటు దక్కగా.. పెద్దపల్లి పరిధిలోకి వచ్చే మంచిర్యాల జిల్లాలో 754 పోలింగ్ కేంద్రాల పరిధిలో 6,47,646 మంది ఓటర్లకు చోటు లభించింది. అయితే ఈ నెల 15 వరకు ఓటరు నమోదు, మార్పులకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది.
Similar News
News March 5, 2025
గాంధీ భవన్‌లో ఆదిలాబాద్ సమీక్షా సమావేశం

హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో బుధవారం ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి, మంత్రి సీతక్క హాజరై జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి పనులపై చర్చించారు. ఎమ్మెల్యే బొజ్జు, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు, విష్ణునాథ్, విశ్వనాథం పాల్గొన్నారు.
News March 5, 2025
ఉట్నూర్: చెట్టు లాలించింది.. అమ్మ పరీక్ష రాసొచ్చింది

చీరతో చెట్టుకు ఊయలకు కట్టి అందులో పాపను ఉంచి తల్లి ఇంటర్ పరీక్ష రాసిన ఆసక్తికర ఘటన ఉట్నూర్ మండలం లాల్‌టెక్డిలో చోటుచేసుకుంది. స్థానిక గురుకుల కళాశాలలోని పరీక్షకేంద్రానికి బుధవారం ఓ తల్లి బిడ్డతో వచ్చింది. చదువుకోవాలనే తపన తల్లిది.. కానీ బిడ్డను ఎక్కడ ఉంచాలో తెలియని పరిస్థితి. అలాంటి సమయంలో పాలు తాగే వయసున్న బిడ్డను చెట్టుకు చీరతో ఊయల కట్టి అందులో ఉంచింది. తోడుగా తన తల్లిని ఉంచి పరీక్ష రాసొచ్చింది.
News March 5, 2025
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు: ADB ఎస్పీ

రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించడానికి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యచరణను రూపొందించనున్నట్లు ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. జిల్లా పోలీసులతో ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోడ్డు ప్రమాదాలపై విచారణ చేపట్టారు. ప్రమాద నివారణకు రంబుల్ స్టెప్స్, సూచిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు, స్పీడ్ లేజర్ గన్ ఏర్పాటు చేయాలని, జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలని సూచించారు.