News March 21, 2024

ఆదిలాబాద్-మహారాష్ట్ర బార్డర్‌లో హై అలర్ట్ 

image

మహారాష్ట్ర గడ్చిరోలి ఎన్ కౌంటర్‎తో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల పోలీసులు అలర్ట్ అయ్యారు. గడ్చిరోలి ఎన్ కౌంటర్‎తో మావోలు ప్రాణహిత దాటి మహారాష్ట్ర నుంచి తెలంగాణాలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నించే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో ప్రాణహిత తీరం వెంట హై అలర్ట్ ప్రకటించారు.
మహారాష్ట్రలోని అటవీప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో పలువురు హతమవ్వగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై నిఘా పెంచారు.

Similar News

News October 23, 2025

ఉట్నూర్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

image

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్ పల్లి ఐబీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం మధ్యాహ్నం ఎదురెదురుగా బొలెరో వాహనం, బైక్ ఢీకొన్నాయని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఉట్నూర్ మండలం ఘన్పూర్ గ్రామానికి చెందిన అంకన్నతో పాటు మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 23, 2025

ఆదిలాబాద్: కరాటే మాస్టర్లు…ఇది మీకోసమే

image

విద్యార్థులకు కరాటే శిక్షణ నేర్పడానికి కరాటే మాస్టర్లు ఈనెల 23 నుంచి 30 వరకు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని DEO ఖుష్బూ గుప్తా పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లో పాఠశాల వారీగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. స్థానికత, బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్, పూర్వపు అనుభవం వారి ప్రతిభ ఆధారంగా కరాటే మాస్టర్లను ఎంపిక చేస్తామన్నారు. మహిళా కరాటే మాస్టర్లకు ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు.

News October 23, 2025

వయోవృద్ధులకు సేవ చేయడమే నిజమైన పూజ: కలెక్టర్

image

బోరిగామ జడ్పీఎస్‌ఎస్‌లో ‘ఆరోగ్య పాఠశాల’లో భాగంగా, ‘హెల్ప్‌ ఏజ్‌ ఇండియా’ నిర్వహించిన ‘గ్రాండ్‌ పేరెంట్స్‌ పాద పూజ’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. వయోవృద్ధులకు సేవ చేయడమే నిజమైన పూజ అన్నారు. అనంతరం వృద్ధుల సంక్షేమం, సమస్యల పరిష్కారంపై జరిగిన వర్క్‌షాప్‌లో మాట్లాడారు. ఈ కార్యక్రమాలలో డీడబ్ల్యూఓ మిల్కా, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.