News July 17, 2024
ఆదిలాబాద్: మూడు రోజులు భారీ వర్షాలు..!

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గురువారం, శుక్రవారం, శనివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 11.5 నుంచి 20 సెం.మీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. కాగా మంగళవారం ఆసిఫాబాద్ దహెగాం మండలం కుంచవెల్లిలో 13.2 సెంటిమీటర్ల వర్షం కురిసింది.
Similar News
News October 14, 2025
ADB: 2 వారాలు.. 26 మోసాలు.. మీరూ జాగ్రత్త..!

ఇచ్చోడ మండల కేంద్రం నుంచి ఒకరు ట్రాన్స్‌ఫోర్ట్ కావాలని ఆన్లైన్లో వెతకగా నకిలీ కస్టమర్ కేర్ వ్యక్తులు బాధితున్ని సంప్రదించారు. ఆదిలాబాద్ రూరల్ మండలానికి చెందిన ఒక వ్యక్తికి కేరళ లాటరీ రూ.5 లక్షలు వచ్చిందంటూ సైబరాసురులు మోసాలకు పాల్పడ్డారు. జిల్లాలో 2వారాల వ్యవధిలో 26మోసాలు జరిగాయంటే అమాయకులు ఎలా మోసపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. మోసపోతే వెంటనే 1930కి కాల్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.
News October 14, 2025
ఆదిలాబాద్: నైపుణ్యంతో న్యాక్ సర్టిఫికెట్స్

పనిలో వృత్తి నైపుణ్యం కలిగిన సర్టిఫికెట్ లేని అభ్యర్థులకు న్యాక్ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెలలో రెండు బ్యాచ్‌లకు ఒక రోజు RPL ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా నైపుణ్యాన్ని పరీక్షించి సర్టిఫికెట్లు అందించనున్నట్లు ట్రైనింగ్ కోఆర్డినేటర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు. సర్టిఫికెట్ పొందుటకు శిక్షణ రుసుం రూ.1,200 చెల్లించాలన్నారు. మరిన్ని వివరాలకు 9154548063 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
News October 13, 2025
ఆదిలాబాద్‌లో బంగారు ధర రికార్డు

ఆదిలాబాద్ పట్టణ వెండి, బంగారు వర్తక సంఘం ధరలు ప్రకటించింది. 24 కారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రికార్డు స్థాయిలో రూ.1,30,500 గా నమోదైంది. అదేవిధంగా వెండి 10 గ్రాములకు రూ.1,850గా ఉంది. ఈ కొత్త ధరలు నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. బంగారం ధరల్లో పెరుగుదల కొనుగోలుదారులను ఆందోళనకు గురి చేస్తోంది.