News April 29, 2024

ఆదిలాబాద్: మైక్రో అబ్జర్వర్స్ ర్యాండమైజేషన్

image

లోక్ సభ ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్ నియోజక వర్గాల వారిగా మైక్రో అబ్జర్వర్స్
ర్యాండమైజేషన్‌ను సాదారణ పరిశీలకులు రాజేంద్ర విజయ్, జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజర్షి షా ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. అదిలాబాద్ పార్లమెంటరీ సెగ్మెంట్ల వారిగా అదిలాబాద్ 14, బోథ్ 30, ఆసిఫాబాద్ 24, సిర్పూర్ 16, నిర్మల్, 30, ఖానాపూర్ 49, ముదోల్ 27 మొత్తం 190 మైక్రో అబ్జర్వర్స్‌ను కేటాయించారు.

Similar News

News April 12, 2026

ఇంటర్ సెకండియర్ ఫలితాలు.. ADBకు 33వ ర్యాంకు

image

ఇంటర్ సెకండియర్ ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఆదిలాబాద్(D)లో రెగ్యులర్ విద్యార్థులు 7,518 మంది పరీక్షలు రాయగా 4,699 మంది పాసై 62.50% ఉత్తీర్ణతతో 33వ స్థానంలో నిలిచింది. ఇక రెగ్యులర్ ఒకేషనల్‌లో 905 మందికి 669 మంది పాసై73.95 శాతంతో 18వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 452 మందికి 162 మంది పాసై 35.84%తో 8వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో 53 మందికి 15 మంది పాసై 28.30%తో 34వ ప్లేస్ వచ్చింది.

News April 12, 2026

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు.. 32వ స్థానంలో ADB

image

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ADB జిల్లా 50.77% ఉత్తీర్ణతతో 32వ స్థానంలో నిలిచింది. మొత్తం 7,701 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 3,910 మంది పాస్ అయ్యారు. బాలురు 3,773 మంది పరీక్ష రాయగా 1,391 మంది 36.87% పాస్ అయ్యారు. బాలికలు 3,928 మందికి గాను 2519 మంది 64.13% ఉత్తీర్ణత సాధించి సత్తా చాటారు. ఒకేషనల్‌లో 935 మంది పరీక్ష రాయగా 620 మంది పాసై 66.31 శాతంతో స్టేట్‌లో 9వ స్థానంలో నిలిచింది.

News April 12, 2026

ADB: ఈసారి శాతం పెరిగేనా..?

image

గత ఇంటర్మీడియట్ ఫలితాల్లో మొదటి సంవత్సరంలో 9,106 మంది పరీక్షలు రాయగా 4,967 మంది విద్యార్థులు పాస్ కాగా 54.55 శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే ద్వితీయ సంవత్సరంలో 8,890 మంది పరీక్షలు రాయగా 6,291 మంది విద్యార్థులు పాస్ కాగా 70.76 శాతంగా నమోదైంది. మొదటి సంవత్సరంలో రాష్ట్రంలో 27వ స్థానం నిలువగా, రెండవ సంవత్సరంలో 12వ స్థానంలో నిలిచింది. మరి ఈసారి ఫలితాల శాతం, స్థానం మెరుగుపడుతుందో లేదో చూడాలి మరి.