News March 18, 2025

ఆదిలాబాద్: యువకుడికి ST కేటగిరిలో 1st ర్యాంకు

image

ఆదిలాబాద్ రూరల్ లోహర గ్రామానికి చెందిన మర్సకోల జ్యోతిరాం నిన్న విడుదలైన HWO ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చాటారు. పట్టుదలతో కష్టపడి చదివి రాష్ట్రస్థాయిలో 34వ ర్యాంకు, బాసర జోన్ ST కేటగిరిలో మొదటి ర్యాంక్ సాధించి, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌కి ఎంపికయ్యారు. ఉద్యోగం సాధించడంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News April 24, 2025

ADB: వడ్డీ వ్యాపారులపై కొరడా జులిపిస్తున్న ఎస్పీ

image

జనాల రక్తాన్ని పిండి పీడిస్తున్న వడ్డీ వ్యాపారులపై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన కొరడా జలపిస్తున్నారు. ఆదిలాబాద్ వన్ టౌన్, టూ టౌన్, మావల, ఇచ్చోడ, బోథ్, ఉట్నూర్ ప్రాంతాలలో ఏకకాలంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 6 మండలాలలో 30 బృందాలతో ఆకస్మిక దాడులు చేశారు. అధిక వడ్డీ వసూలు చేసే వడ్డీ వ్యాపారులపై జిల్లా వ్యాప్తంగా దాదాపు 20 కేసుల నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 23, 2025

MNCL: జిల్లాలో విషాదం.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

image

మంచిర్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. లక్షెట్టిపేటలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని సుస్మిత (16) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్ష ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని మనస్తాపం చెంది ఉరేసుకుందన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 23, 2025

సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటిన ADB బిడ్డ

image

UPSC సివిల్స్ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా యువకుడు ఆదా సందీప్ సత్తా చాటాడు. ఇంటెలిజెన్స్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న వెంకటేష్-వాణి దంపతుల చిన్న కుమారుడు సందీప్ సివిల్స్ ఫలితాల్లో 667 ర్యాంక్ సాధించాడు. గతంలో తొలి ప్రయత్నంలో 830 ర్యాంక్ సాధించాడు. అదే పట్టుదలతో మళ్లీ పరీక్ష రాసి ఇప్పుడు 667 ర్యాంక్ సాధించడంతో కుటుంబీకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పలువురు సందీప్‌ను అభినందించారు.

error: Content is protected !!