News January 20, 2025
ఆదిలాబాద్: యువకుడిపై పోక్సో కేసు నమోదు

ఓ యువకుడిపై ADB 1 టౌన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. DSP జీవన్ రెడ్డి వివరాలు.. ఓ కళాశాలలో చదువుతున్న బాలిక (17)తో సుందరయ్యనగర్‌కు చెందిన చౌహాన్ అంకుష్ (23) పరిచయం పెంచుకున్నాడు. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి ఈనెల 10న ఆమెను HYD తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు నమోదు చేసిన పోలీసులు బాలిక ఆచూకీ తెలుసుకున్నారు. అనంతరం అతడిపై కిడ్నాప్, అత్యాచారం, పోక్సో కేసులు నమోదు చేశారు.
Similar News
News February 10, 2025
బాజీరావు మహారాజ్ బోధనలు ఆచరణీయం: రూపేశ్ రెడ్డి

ఆధ్యాత్మిక గురువు బాజీరావు మహారాజ్ భౌతికంగా దూరమైన ఆయన బోధనలు ఆచరణీయమని, వేలాది మంది జీవితాల్లో ఆయన వెలుగులు నింపారని యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేశ్ రెడ్డి అన్నారు. బేల మండలంలోని చెప్రాల గ్రామంలో వారం రోజుల నుంచి కొనసాగుతున్న బాజీరావ్ మహారాజ్ సప్త వేడుకలు ఆదివారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ముగిశాయి. ఈ వేడుకల్లో ఆయన హాజరై మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి పల్లకిని గ్రామంలో ఊరేగించారు.
News February 9, 2025
కౌటాలలో పదో తరగతి విద్యార్థిని సూసైడ్

పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కౌటాలలో చోటుచేసుకుంది. ఎస్ఐ మధుకర్ వివరాల ప్రకారం.. మండలంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న హనీస్ఫూర్తి స్టడీ మెటీరియల్ కోసం మొబైల్ ఫోన్ అడగ్గా తల్లి నిరాకరించింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.
News February 9, 2025
ADB ఎస్పీ పెళ్లి వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ దంపతులు

ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌష్ ఆలం పెళ్లి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. జిల్లా ఉన్నతాధికారులు వేడుకల్లో పాల్గొన్నారు. శనివారం భోదిలో జరిగిన రిసెప్షన్‌లో కలెక్టర్ రాజర్షి షా ఆయన భార్య నితికా పంత్‌తో కలిసి పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. వారితో పాటు డీఎఫ్‌వో ప్రశాంత్ బాజీరావు పాటిల్, తదితరులు ఉన్నారు.