News June 30, 2024
ఆదిలాబాద్: రాథోడ్ రమేశ్ ప్రస్థానం
ఆదిలాబాద్ మాజీ MP రమేశ్ రాథోడ్, అట్టడుగు స్థాయి నుంచి రాజకీయ నాయకుడిగా ఎదుగుతూ వచ్చారు. నార్నూర్ మండలం తాడిహత్నూర్‌కి చెందిన రమేశ్ OCT 20 1966లో జన్మించారు. రాజకీయ ప్రస్థానం TDP తరఫున 1995లో జడ్పీటీసీగా ప్రారంభమైంది. పలు పదవుల్లో బాధ్యతలు స్వీకరించి ఎనలేని సేవలను అందించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తనదైన శైలిలో రాజకీయ ముద్ర వేసుకున్నారు. కాగా, నిన్న అస్వస్థతకు గురై మృతి చెందాడు.
Similar News
News December 12, 2024
ADB: జిల్లాలో పలువురు ఎస్ఐలకు స్థానచలనం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలువురు ఎస్ఐలకు స్థాన చలనం కల్పిస్తూ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ మల్టీ జోన్ 1 డిఐజి ఉత్తర్వులు జారీ చేశారు. కొంతమంది ఎస్ఐలు ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న ఆయా స్టేషన్లలోనే వారిని కొనసాగిస్తున్నట్లు ఉత్తర్వులు పేర్కొన్నారు. మరి కొంతమందిని స్థానచలనం కల్పించారు. ఇదిలా ఉంటే ఏ. భీంరావు కు ఎస్సైగా పదోన్నతి కల్పించారు.
News December 12, 2024
గ్రూప్-2 కు నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ: ఆదిలాబాద్ కలెక్టర్
గ్రూప్ 2 పరీక్షలు వ్రాసే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు సకాలం లో చేరుకోవాలని నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాలకు అనుమతి లేదని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ నెల డిసెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించే గ్రూప్-2 పరీక్షల నిర్వహణ పై చీఫ్ సూపరింటెండెంట్లు, రూట్ ఆఫీసర్స్, ఇన్విజిలేటర్లతో సమావేశం నిర్వహించారు. అభ్యర్థులు మొబైల్ ఫోన్లు తీసుకురావద్దన్నారు.
News December 11, 2024
తాండూరు: గడ్డి మందు తాగి నలుగురు ఆత్మహత్య
తాండూరు మండలం కాసిపేటకి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు SI కిరణ్ కుమార్ వెల్లడించారు. ఆయన వివరాల ప్రకారం.. శివప్రసాద్ అనే వ్యక్తి ఆన్లైన్ ట్రేడింగ్ చేసేవాడు. అందులో నష్టాలు రావడంతో అప్పులు తీర్చలేక తన కుటుంబ సభ్యులు తండ్రి మొండయ్య, తల్లి శ్రీదేవి, అక్క చైతన్యతో కలిసి గడ్డి మందు తాగాడు. వరంగల్ MGMలో చికిత్స పొందుతూ మరణించారని ఎస్సై వివరించారు.