News October 28, 2024
ఆదిలాబాద్: రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

ఆదిలాబాద్ క్రీడా పాఠశాలకు చెందిన జూడో క్రీడాకారులు సత్తా చాటారు. ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగిన జోనల్ స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కాంతారావు, కోచ్ రాజు తెలిపారు. వీరంతా మహబూబ్ నగర్లో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించనున్నారు.
Similar News
News October 16, 2025
ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ డీపీఆర్ఓగా విష్ణువర్ధన్

ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ జిల్లా పౌర సంబంధాల అధికారి (డిపిఆర్ఓ)గా ఎల్చల విష్ణువర్ధన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ రాజార్షి షాను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. కలెక్టర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా పౌర సంబంధాల విభాగం పనితీరు మరింత ప్రభావవంతంగా ఉండేలా కృషి చేయాలని సూచించారు.
News October 16, 2025
ఫ్లాగ్ డే వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలి: ADB SP

ఫ్లాగ్ డే వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ప్రజాసేవలో అమరులైన జిల్లా పోలీసుల జ్ఞాపకార్థం పలు కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అక్టోబర్ 21న ఫ్లాగ్ డే ఉంటుందన్నారు. పోలీస్ పరేడ్ మైదానంలో ఈ నెల 22న మెగా రక్తదానం, 23న ఓపెన్ హౌస్, పట్టణంలో సైకిల్ ర్యాలీ, 24న 5కే రన్ చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
News October 16, 2025
ADB: ఆ కుటుంబం ఊపిరి తీసిన రహదారులు

వరుస రోడ్డు ప్రమాదాలు ఆ కుటుంబం ఉసురు తీశాయి. కొన్నేళ్ల కిందట పందులు అడ్డు రావడంతో జరిగిన ప్రమాదంలో స్టీఫెన్ భార్య వాహనంపై నుంచి జారిపడి చనిపోయారు. ఈ విషాదం మరువక ముందే, బుధవారం భిక్కనూరులో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో స్టీఫెన్, ఆయన పెద్ద కుమార్తె జాస్లీన్, ఆమె ఇద్దరు పిల్లలు కూడా మృతి చెందారు. వరుసగా ముగ్గురు కుటుంబ సభ్యులు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది.