News October 28, 2024
ఆదిలాబాద్: రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
ఆదిలాబాద్ క్రీడా పాఠశాలకు చెందిన జూడో క్రీడాకారులు సత్తా చాటారు. ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగిన జోనల్ స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కాంతారావు, కోచ్ రాజు తెలిపారు. వీరంతా మహబూబ్ నగర్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించనున్నారు.
Similar News
News November 3, 2024
భార్యాభర్తలను అరెస్ట్ చేసిన మంచిర్యాల పోలీసులు
మ్యాట్రిమోనీ పేరుతో సైబర్ నేరాలకు పాల్పడుతున్న భార్యాభర్తలను అరెస్ట్ చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ SHO DSP వెంకటరమణ తెలిపారు. మంచిర్యాల జిల్లాకు చెందిన ఒక వ్యక్తి సైబర్ నేరగాళ్ల చేతిలో రూ.17లక్షలు మోసపోయారన్నారు. దీంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఏలూరు జిల్లాకు చెందిన వెంకట నాగరాజు, సౌజన్యలను అరెస్ట్ చేసినట్లు DSP వెల్లడించారు.
News November 3, 2024
కాగజ్‌నగర్: రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి
కాగజ్‌నగర్ మండలం వేంపల్లి వద్ద <<14518702>>రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న<<>> విషయం తెలిసిందే. కాగా ఈ ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ రాథోడ్ శంకర్ మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. ప్రమాదమైన వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తుండగానే శంకర్ మృతి చెందారు.
News November 3, 2024
తలమడుగు: పసివాడి పాలకోసం.. ఆవు, దూడను అందజేసిన సీఐ
తలమడుగు మండలం పల్లి (బి) గ్రామానికి చెందిన రేణుకా అనే మహిళ ఇటీవల బాబుకు జన్మనిచ్చి అనారోగ్యంతో మృతి చెందింది. కాగా ఆ బాబు పాల కోసం అవస్థలు పడుతుండడంతో కొందరు వ్యక్తులతో ఈ విషయాన్ని తెలుసుకొని ఇచ్చోడ మండల సమీపంలోని శ్రీ జై శ్రీరామ్ గోశాలకు వెళ్ళగా.. సీఐ భీమేష్ చేతుల మీదుగా బాబు తండ్రి మారుతికి ఆవు, దూడను అందజేశారు. ఈ కార్యక్రమంలో గోశాల నిర్వహకులు ఐదా రాజేష్ తదితరులు పాల్గొన్నారు.