News August 14, 2024

ఆదిలాబాద్: రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు నామినేషన్ల స్వీకరణ

image

ప్రతి సంవత్సరం జనవరిలో రాష్ట్రపతి చేతుల మీదుగా అందించే ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుల కోసం ఆన్‌లైన్‌లో నామినేషన్లు స్వీకరించనున్నట్లు ఆదిలాబాద్ జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ రాజేంద్ర ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అవార్డుకు 5 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయస్సు గల పిల్లలు చూపించిన సాహసాన్ని ప్రస్తావిస్తూ ఆన్‌లైన్‌లో https://awards.gov.inలో ఆగస్టు 31లోపు దరఖాస్తు చేసుకోగలరు.

Similar News

News December 4, 2025

ADB: ‘సైనికుల సహాయార్థం విరాళాలు అందించాలి’

image

దేశ రక్షణకు సరిహద్దులో బాధ్యత, త్యాగనిరతి, అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న సైనికుల సహాయార్థం సైనిక పతాక దినోత్సవ నిధి ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. సైనిక పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 5న ఎన్‌సీసీ క్యాడెట్లు జిల్లా కేంద్రంలో విరాళాలు సేకరిస్తారన్నారు. తోచిన విరాళాలు అందించి, దేశ రక్షణకు శ్రమిస్తున్న సైనికులు, వారి కుటుంబాలకు అండగా నిలబడాలని పేర్కొన్నారు.

News December 4, 2025

ADB: సీఎం పర్యటన.. ఎన్నికల స్టంట్ ఏనా..?

image

పంచాయతీ ఎన్నికల సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటించడంపై పలు రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి పనులకు సంబంధించి జిల్లాకు వస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లాకు వచ్చి ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు ఉన్నాయని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. అందుకే పట్టణంలో ఎన్నికల నియమావళి ఉండదని అక్కడ సీఎం సభ పెట్టారని మండిపడుతున్నారు.