News August 26, 2024
ఆదిలాబాద్: ‘రిమ్స్‌లో నాణ్యమైన చికిత్సను అందించాలి’

అదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన చికిత్సను అందించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ అన్నారు. ఆదివారం సాయంత్రం జిల్లా కేంద్రంలో ఉన్న రిమ్స్ ప్రభుత్వాసుపత్రిలో ఉన్న రోగులతో వారు మాట్లాడారు. రోగులకు చికిత్సతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్‌ను కోరారు.
Similar News
News November 6, 2025
నేటి బంద్ వాయిదా: ADB కలెక్టర్

రాష్ట్ర జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 6 నుంచి పంట కొనుగోళ్ల నిరవదిక బంద్‌ను వాయిదా వేసినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. రాష్ట్ర మంత్రులు, ఏపీసీ, సెక్రటరీ, సీసీఐ సీఎండీ, జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి మధ్య జరిగిన చర్చలు సఫలం అయ్యాయన్నారు. దీంతో ఈ నెల 6 నుంచి చేపట్టే కొనుగోళ్ల నిరవధిక సమ్మెను వాయిదా వేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.
News November 6, 2025
ADB: ఈ రెండో శనివారం సెలవు రద్దు

ఈ నెల 8న రెండో శనివారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలకు పని దినాలుగా ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 28న అత్యధిక వర్షం కురిసిన నేపథ్యంలో సెలవులు ఇవ్వడంతో ఆ సెలవు దినానికి బదులుగా ఈ శనివారం విద్యా సంస్థల సెలవు రద్దు చేశామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని విద్యా సంస్థలు గమనించాలని సూచించారు.
News November 5, 2025
సమాచార వ్యవస్థను సొంతంగా నిర్మించుకోవాలి: ADB SP

డయల్ 100 సిబ్బంది పటిష్టమైన సమాచార వ్యవస్థను సొంతంగా నిర్మించుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. బుధవారం పోలీస్ హెడ్ కోటర్స్ సమావేశ మందిరంలో జిల్లాలోని బ్లూ కోర్ట్, డయల్ 100 సిబ్బందితో సమావేశం నిర్వహించారు. నిరంతరం విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తూ ఉండాలని, డయల్ 100 సేవలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. రాత్రుళ్లు గస్తీ తప్పనిసరిగా చేయాలని ఆదేశించారు.


