News August 26, 2024

ఆదిలాబాద్: ‘రిమ్స్‌లో నాణ్యమైన చికిత్సను అందించాలి’

image

అదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన చికిత్సను అందించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ అన్నారు. ఆదివారం సాయంత్రం జిల్లా కేంద్రంలో ఉన్న రిమ్స్ ప్రభుత్వాసుపత్రిలో ఉన్న రోగులతో వారు మాట్లాడారు. రోగులకు చికిత్సతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్‌ను కోరారు.

Similar News

News September 10, 2024

ADB: నోటితో విషం తీసి విద్యార్థి ప్రాణం కాపాడిన టీచర్

image

విద్యార్థిని పాము కాటేయడంతో వెంటనే ఓ ఉపాధ్యాయుడు నోటితో విషం తొలగించి విద్యార్థి ప్రాణాన్ని కాపాడాడు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం ధనోర ప్రభుత్వ పాఠశాలలో సోమవారం 1వ తరగతి విద్యార్థి యశ్వంత్‌ని పాము కాటేసింది. వెంటనే ఉపాధ్యాయుడు సురేశ్ నోటితో విషం తీసేసి విద్యార్థి ప్రాణం కాపాడినట్లు స్థానికులు తెలిపారు. దీంతో ఆయన్ను పలువురు అభినందించారు.

News September 10, 2024

ADB: రిమ్స్ ఆసుపత్రి టాయిలెట్‌లో క్రికెటర్ మృతి

image

ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో జిల్లాకు చెందిన క్రికెటర్ మృతిచెందాడు. శాంతినగర్‌కు చెందిన శ్రీహరి తన కుమారుడి బ్లడ్ రిపోర్ట్స్ కోసం సోమవారం రిమ్స్‌కి వెళ్లాడు. ఆసుపత్రిలో బాత్‌రూమ్‌కి వెళ్లిన శ్రీహరి తిరిగి రాలేదు. కాగా టాయిలేట్ నుంచి ఫోన్ రింగ్ అవడం గమనించిన సిబ్బంది తలుపు తెరిచి చూడగా అతడు కిందపడి ఉన్నాడు. పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు.

News September 9, 2024

బాసర: అర్జీయూకేటీ విద్యార్థుల చర్చలు సఫలం

image

బాసర అర్జీయూకేటి వీసీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అసోసియేట్ డీన్లు సోమవారం విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వివిధ సమస్యలపై చర్చించి, ప్రభుత్వంలోని అవసరమైన ఏజెన్సీలతో మాట్లాడి వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.