News September 13, 2024

ఆదిలాబాద్: రూ.818కే విద్యుత్ మీటర్

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పేదవారికి తక్కువ ధరకే ప్రభుత్వం విద్యుత్ మీటర్లు అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇంట్లో విద్యుత్ కనెక్షన్ లేనివారు ఈ నెల 15 వరకు నూతన మీటర్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 500 వాట్స్‌కి రూ.938, 250 వాట్స్‌కి రూ.818 చెల్లించాల్సి ఉంటుంది. విద్యుత్ కార్యాలయాలు, ఉపకేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే చాలు.

Similar News

News December 3, 2025

విజయ్ మర్చెంట్ ట్రోఫీకి ADB క్రికెటర్ ఎంపిక

image

ADB జిల్లాకు చెందిన యువ క్రికెటర్‌ కశ్యప్ పటాస్కర్ ప్రతిష్టాత్మక విజయ్ మర్చెంట్ ట్రోఫీ (అండర్–16) కి వరుసగా రెండోసారి ఎంపికయ్యాడు. ఈ టోర్నమెంట్ డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 31 వరకు కర్ణాటకలోని శివమొగ్గలో జరగనుంది. విజయ్ మర్చంట్ ట్రోఫీకి ఎంపిక కావడం పట్ల శిక్షకుడు జయేంద్ర పటాస్కర్ తదితరులు కశ్యప్‌కు అభినందనలు తెలిపారు.

ADB: సీఎం రేవంత్ పర్యటనపైన ప్రగతి ఆశలు

image

సీఎం రేవంత్ రెడ్డి రేపు జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. సీఎం పర్యటనతో జిల్లా అభివృద్ధిపై ఆశలు చిగురిస్తున్నాయి. బాసర ఆలయం, కుంటాల జలపాతం, జైనథ్ టెంపుల్ అభివృద్ధిపై వరాల జల్లు కురిపిస్తారని జిల్లా ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, మౌలిక వసతులు, సమస్యలపై సీఎం స్పందిస్తే మేలు జరుగుతుందని పేర్కొంటున్నారు. ఇలా జిల్లాకి ఇంకేం కావాలో కామెంట్ చేయండి.