News February 6, 2025
ఆదిలాబాద్: రెండో భార్యను చంపిన భర్త

అనుమానంతో వ్యక్తి రెండో భార్యను హత్యచేశాడు. ఈఘటన ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం భీంపూర్‌లో జరిగింది. పోలీసుల ప్రకారం.. గ్రామానికి చెందిన మరోతికి ఇద్దరు భార్యలు. ఈక్రమంలో రెండో భార్య అయిన రుక్కుబాయికి వివాహేత సంబంధం ఉందని అనుమానం పెట్టుకున్నాడు. మద్యం తాగి వచ్చి గొడవ చేసేవాడు, చంపేస్తానని బెదిరించేవాడు. దీంతో మంగళవారం రుక్కుబాయి(26) ఛాతిపై బండతో కొట్టి హత్య చేసి పారిపోయాడు. కేసు నమోదైంది.
Similar News
News March 21, 2025
ప్రధాని విదేశీ పర్యటనల ఖర్చు రూ.258కోట్లు

ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చును కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే ప్రధాని పర్యటనల ఖర్చును తెలపాలని కోరగా విదేశాంగ శాఖ బదులిచ్చింది. 2022 మే నుంచి 2024 డిసెంబర్ వరకూ ప్రధాని 38 విదేశీ పర్యటనలకు చేయగా రూ. 258కోట్లు ఖర్చయినట్లు తెలిపింది. 2023 జూన్‌లో జరిగిన అమెరికా పర్యటనకు అధికంగా రూ.22కోట్లు ఖర్చు జరిగినట్లు తెలిపింది.
News March 21, 2025
మెదక్: రూ.1,70,42,046 ఆస్తిపన్ను చెల్లించిన జిల్లా జడ్జి

మెదక్ కోర్టు భవనాల ఆస్తి పన్ను బకాయి మొత్తాన్ని జిల్లా జడ్జి లక్ష్మీ శారద చెల్లించారు. జిల్లా జడ్జికి మెదక్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గత కొంతకాలంగా కోర్టు భవనాల ఆస్తిపన్ను బకాయి ఉండడం వల్ల ఈ విషయాన్ని జిల్లా జడ్జి లక్ష్మీ శారద దృష్టికి మున్సిపల్ అధికారులు తీసుకెళ్లారు. తక్షణమే స్పందించి రూ.1,70,42,046 ను గురువారం చెల్లించారు.
News March 21, 2025
ASF: 400 మందికి దరఖాస్తులు కావడం లేదు..!

జిల్లాలోని నాయీ బ్రాహ్మణులు నేడు జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. గత 2023-24 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలోని నాయీ బ్రాహ్మణులు 400మంది బీసీ బంధు కోసం దరఖాస్తు చేసుకున్నామన్నారు. అది రాకపోగా.. నేడు రాజీవ్ యువ వికాసం కోసం దరఖాస్తులు కావడం లేదని వాపోయారు. ఆన్‌లైన్ చేస్తుంటే అప్లై కావడం లేదని.. సమస్యను పరిష్కరించాలని కోరారు.