News February 6, 2025

ఆదిలాబాద్: రెండో భార్యను చంపిన భర్త

image

అనుమానంతో వ్యక్తి రెండో భార్యను హత్యచేశాడు. ఈఘటన ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం భీంపూర్‌లో జరిగింది. పోలీసుల ప్రకారం.. గ్రామానికి చెందిన మరోతికి ఇద్దరు భార్యలు. ఈక్రమంలో రెండో భార్య అయిన రుక్కుబాయికి వివాహేత సంబంధం ఉందని అనుమానం పెట్టుకున్నాడు. మద్యం తాగి వచ్చి గొడవ చేసేవాడు, చంపేస్తానని బెదిరించేవాడు. దీంతో మంగళవారం రుక్కుబాయి(26) ఛాతిపై బండతో కొట్టి హత్య చేశాడు. కేసు నమోదైంది.

Similar News

News November 18, 2025

కడియం శ్రీహరిపై అనర్హత వేటు? రాజకీయాల్లో వేడి!

image

BRS నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన పది మంది MLAలపై ఫిరాయింపు ఫిర్యాదును స్పీకర్ త్వరగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందులో స్టేషన్‌ఘన్పూర్ MLA కడియం శ్రీహరి కూడా ఉన్నారు. ఇప్పటికే పలువురిని పరిశీలించినప్పటికీ కడియం శ్రీహరి, దానం నాగేందర్ స్పీకర్ నోటీసులకు స్పందించలేదు. రోజువారీ విచారణ జరిపి నాలుగు వారాల్లో నిర్ణయం ఇవ్వాలని కోర్టు ఉత్తర్వులతో ఉప ఎన్నికతో సంభావ్యత పెరిగింది.

ఆయన ఆవిష్కరణలే ఆధునిక ఫోటోగ్రఫీకి బాట

image

ఫోటోగ్రఫీ పితామహుడిగా పేరుపొందిన లూయిస్ జాకస్ మండే డాగురే జన్మదినం నవంబర్‌ 18, 1787ను స్మరించుకుంటూ ప్రపంచం ఆయనను గుర్తుచేసుకుంది. డాగురే ఆవిష్కరించిన డాగురోటైప్ పద్ధతి ఆధునిక ఫోటోగ్రఫీకి బాట వేసింది. ఒకప్పుడు ఫోటోగ్రాఫర్ కి మాత్రమే పరిమితమైన కెమెరా, సాంకేతికత పెరిగి నేడు సామాన్యులు కూడా మొబైల్‌లు, కెమెరాలు వాడుతూ జ్ఞాపకాలను బంధించే ఈ ప్రపంచం ఆయన ప్రయోగాలపైనే నిలబడి ఉంది.