News July 6, 2024
ఆదిలాబాద్: రేషన్ కార్డుల కోసం అర్హుల ఎదురుచూపులు
ఆహారభద్రత కార్డుల్లో అనర్హులను గుర్తించి తొలగిస్తున్న ప్రభుత్వం అర్హులకు అన్యాయం చేస్తోంది. మూడేళ్లుగా రేషన్‌కార్డుల దరఖాస్తులకు సంబంధించిన వెబ్సైట్ మూసివేసింది. ఫలితంగా కార్డుల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండాపోయింది. ADB జిల్లాలో 5 నెలల వ్యవధిలో 89 కార్డులు రద్దుచేయగా , 664 మందిని అనర్హులుగా గుర్తించి తొలగించారు. కార్డుల్లేని నిరుపేదలు ప్రభుత్వపథకాలు పొందలేని పరిస్థితి నెలకొంది.
Similar News
News December 9, 2024
అభయారణ్యంలో వ్యవసాయ విద్యార్థుల పర్యటన
జన్నారం మండలం కవ్వాల్ అభయారణ్యంలో జగిత్యాల వ్యవసాయ కళాశాలకు చెందిన విద్యార్థులు పర్యటించారు. క్షేత్ర పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం వారు జన్నారం మండలంలోని గోండుగూడా, తదితర అటవీ క్షేత్రాలలో పర్యటించారు. ఈ సందర్భంగా వారికి బటర్ఫ్లై పరిరక్షణ కేంద్రం, అడవులు వన్యప్రాణుల సంరక్షణ, తదితర వివరాలను అటవీ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీ సిబ్బంది, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
News December 9, 2024
బాసర లాడ్జిలో యువకుడి సూసైడ్
బాసరలోని ఓ ప్రైవేటు లాడ్జిలో ఆదివారం ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. SI గణేశ్ వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం సూరారానికి చెందిన రాజేందర్ (25) నిన్న లాడ్జిలో ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. ‘అమ్మా నన్ను క్షమించు, తమ్ముడిని బాగా చూసుకో, నిన్ను చాలా కష్టపెట్టిన, ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ’ సూసైడ్ నోట్‌ను అతడి తమ్ముడి ఫోన్‌కు పంపినట్లు SI వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.
News December 9, 2024
రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడిADB జిల్లా జట్ల ప్రతిభ
నిజామాబాద్ జిల్లాలోని ఆర్ముర్‌లో మూడు రోజులుగా జరిగిన రాష్ట్రస్థాయి SGFఅండర్-17 సాఫ్ట్ బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాలబాలికల జట్లు ప్రతిభ కనబర్చి కాంస్య పతకాలు సాధించాయి. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను SGF సెక్రెటరీలు ఫణిరాజా, వెంకటేశ్వర్, కోచ్, మేనేజర్లు బండి రవి, చంద్ పాషా, రాజ్ మహమ్మద్, కోట యాదగిరి, పలువురు అభినందించారు.