News July 19, 2024
ఆదిలాబాద్ రైతుతో మాట్లాడిన CM రేవంత్ రెడ్డి

తాంసి మండలం బండల్ నాగపూర్ గ్రామంలోని రైతు వేదికలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మహేందర్ అనే రైతుతో CM రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఎన్ని ఎకరాలు ఉన్నాయని CM అడుగగా రైతు ఒక ఎకరం సగం ఉన్నదని బదులిచ్చారు. 50,000 లోన్ తీసుకున్నాను ఏకకాలంలో రుణమాఫీ అవడం చాలా సంతోషంగా ఉన్నదని రైతు తెలిపారు. మీ ఊరిలో అందరికీ చెప్పాలి మీ ఆదిలాబాద్ జిల్లాకి 120 కోట్లు ఇస్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Similar News
News November 26, 2025
ADB: ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలి

పంచాయతీ ఎన్నికలను పూర్తిగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని సూచించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ శ్యామలాదేవి మాట్లాడుతూ.. జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు చేపట్టాల్సిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామని తెలిపారు.
News November 26, 2025
ADB: ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరి అరెస్ట్

కేర్ ఫౌండేషన్ సైన్స్ ఇన్నోవేషన్ పేరుతో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడిన చంద్రయ్య, మనోజ్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఆదిలాబాద్ 2 టౌన్ సీఐ నాగరాజు తెలిపారు. బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేసిన ప్రధాన నిందితురాలు సుజాతను పట్టుకోవడానికి కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. నిరుద్యోగ యువత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
News November 26, 2025
ఆదిలాబాద్: 3 విడతల్లో VILLAGE WAR

ఆదిలాబాద్ జిల్లాలో 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో డిసెంబర్ 11న ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్, గాదిగూడ, సిరికొండ, ఇచ్చోడ, 14న రెండో విడతలో ఆదిలాబాద్, మావల, బేల, జైనథ్, సాత్నాల, బోరజ్, తాంసి, భీంపూర్, 17న మూడో విడతలో బోథ్, సోనాల, బజార్హత్నూర్,నేరడిగొండ, గుడిహత్నూర్, తలమడుగు మండలాల్లోని గ్రామ పంచాయతీల్లో ఉ.7 గం. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎన్నికలు జరుగుతాయి.


