News November 21, 2024
ఆదిలాబాద్: లాడ్జిలో యువకుడి ఆత్మహత్యాయత్నం
ఆదిలాబాద్ పట్టణంలోని ఓ లాడ్జిలో యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. తాంసి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు ఓ వివాహిత కలిసి లాడ్జికి వచ్చారు. ఈక్రమంలో వారి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆ యువకుడు రూంలో ఉరేసుకున్నట్లు తెలిపారు. మహిళ సమాచారం మేరకు సిబ్బంది రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సీఐ కరుణాకర్ తమకెలాంటి ఫిర్యాదు రాలేదని చెప్పారు.
Similar News
News December 13, 2024
ఉత్తమ విద్యే లక్ష్యంగా బాసర ఐఐఐటీని తీర్చిదిద్దుతాం :సీతక్క
ఉత్తమ విద్యే లక్ష్యంగా బాసర ఐఐఐటీని తీర్చిదిద్దుతామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా పర్యటనలో భాగంగా ఆర్జీయూకేటీ బాసరను మంత్రి సందర్శించారు. క్యాంపస్‌కు చేరుకున్న మంత్రికి జిల్లా కలెక్టర్, ఎస్పీ, వైస్ ఛాన్స్‌లర్, విద్యార్థులు పూల మొక్కలను అందించి స్వాగతం పలికారు.
News December 13, 2024
ఆసిఫాబాద్: గ్రూప్-2 పరీక్షలకు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేయాలి: ఎస్పీ
ఈ నెల 15,16 తేదీల్లో నిర్వహించబోయే గ్రూప్-2 పరీక్షలకు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేయాలని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రూప్-2 పరీక్షల్లో భద్రత ఏర్పాట్లపై పోలీసులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని 18 పరీక్ష కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్- 163 సెక్షన్ విధించడంతో పాటు పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు బంద్ పాటించాలన్నారు.
News December 13, 2024
ఆసిఫాబాద్: పోలీస్ ఉన్నతాధికారులతో జిల్లా SPసమావేశం
ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్-2 పరీక్షల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శుక్రవారం జిల్లా SP శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. SP మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ సెంటర్లు, చుట్టుపక్కల లౌడ్ స్పీకర్లు మూసివేయాలన్నారు. పరీక్ష సెంటర్స్ వద్ద నుంచి 500 మీటర్ల వరకు ప్రజలు గుమిగూడ వద్దన్నారు.