News January 31, 2025

ఆదిలాబాద్: వన్ టౌన్‌లో అట్రాసిటీ కేసు నమోదు

image

ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. CI సునీల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక మోచిగల్లికి చెందిన బాలశంకర్ కృష్ణను సామల ప్రశాంత్ అనే వ్యక్తి ఈనెల 12న వివేకానంద చౌక్‌లో కులం పేరుతో దూషించి, చంపేస్తానని హెచ్చరించినట్లు బాధితుడు ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు CI పేర్కొన్నారు

Similar News

News February 13, 2025

భీంపూర్‌‌లో చిరుత.. స్పందించిన అధికారులు

image

భీంపూర్ మండలంలోని నిపాని గ్రామ శివారులో చిరుత పులి కదలిక పై ఎఫ్ఎస్‌వో అహ్మద్ ఖాన్, ఎఫ్‌బీవో శ్రీనివాస్ స్పందించారు. నిపాని శివారులోని లింగారెడ్డి అనే రైతుకు చెందిన పంట చేనులో చిరుత పులి సంచారం సీసీ కెమెరాలో రికార్డయిందన్నారు. గురువారం పంట చేనుకు వెళ్లి పరిశీలించారు. రైతులెవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

News February 13, 2025

ADB: వ్యక్తిపై లైంగిక దాడి కేసు

image

తనను ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు గురిచేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ADB 1 టౌన్ CI సునీల్ కుమార్ వివరాలు.. తల్లిగారింటి వద్ద ఉంటున్న ఓ వివాహిత(24), శాంతినగర్‌కి చెందిన షేక్ ఆసిఫ్‌ 8నెలల పాటు సహజీవనం చేశారు. కాగా తనను ఆసిఫ్ మోసం చేశాడని, లైంగికంగా వేధించి తన వీడియోలు తీశాడని బాధిత మహిళ ఆరోపించింది. ఆసిఫ్ తనను కులం పేరుతో దూషించాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బుధవారం కేసు నమోదైంది.

News February 13, 2025

నిర్మల్‌: యువతి దారుణ హత్య.. నిందితుడికి జీవత ఖైదు

image

ఏడాది క్రితం ప్రేమ పేరుతో <<12630813>>యువతిని హత్య<<>> చేసిన వ్యక్తికి నిర్మల్ జిల్లా కోర్టు జీవితకాల శిక్ష, విధించింది. పోలీసులు వివరాలు.. ఖానాపూర్ అంబేడ్కర్ కాలనీకి చెందిన శ్రీకాంత్ అదే కాలనీకి చెందిన అలేఖ్యను ప్రేమ పేరుతో వేధించాడు. ఆమె నిరాకరించడంతో ద్వేషం పెంచుకున్నాడు. ఆమెకు వివాహం నిశ్చయం కావడంతో విషయం తెలుసుకున్న శ్రీకాంత్ 2024 ఫిబ్రవరి 8న ఆమెను కత్తితో నడిరోడ్డుపై దారుణంగా హత్య చేశాడు.

error: Content is protected !!