News September 26, 2024
ఆదిలాబాద్: వయోవృద్ధుల దినోత్సవ వారోత్సవాలు
అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 25 – OCT 1 వరకు వయోవృద్ధుల దినోత్సవ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ జిల్లా సంక్షేమ శాఖ అధికారిని సబితా అన్నారు. ఈ నెల 26న వృద్ధాశ్రమాల్లో వయోవృద్ధుల క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు, 27న వాకతాన్ ర్యాలీ, 28న ఆరోగ్య సంరక్షణపై అవగాహన సదస్సు, 29న తల్లిదండ్రుల పోషణ, 30న గ్రాండ్ పేరెంట్స్ డే, OCT 1న వారోత్సవాలు ముగుస్తాయన్నారు.
Similar News
News October 11, 2024
ADB: సర్పంచ్ ఎన్నికలు.. గ్రామాల్లో సందడి
ADB, NRML, MNCL, ASFB జిల్లాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే అధికారులు ఓటర్ జాబితా పనిలో నిమగ్నమవగా పోటీ చేయాలనుకునేవారు ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే తాము ఎన్నికల్లో గెలవాలంటే ఎలాంటి మేనిఫెస్టో రెడీ చేయాలనే దానిపై వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకు ప్రత్యేక చర్చలు కూడా జరుపుతున్నట్లు సమాచారం. ఇక మరికొందరు తమ గ్రామంలో ఓటర్ల వివరాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
News October 11, 2024
ADB: అమ్మవారి రూపంలో హారతి
ఆదిలాబాద్ పట్టణంలోని ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ ఆదర్శ్ దుర్గాదేవి మండలి వద్ద గురువారం రాత్రి దుర్గాదేవికి కాలనీవాసులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజల అనంతరం పూజారి హారతి ఇవ్వగా దుర్గమ్మ రూపంలో కనిపించిందంటూ భక్తులు చర్చించుకున్నారు. అదే సమయంలో హారతిని ఫొటో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు.
News October 11, 2024
ఆదిలాబాద్: ఉపకార వేతనాల కోసం దరఖాస్తుల ఆహ్వానం
2024- 25 విద్యా సంవత్సరంలో ఉపకార వేతనాల మంజూరు కోసం ఈ-పాస్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి సునీత తెలిపారు. జిల్లాలోని ఎస్సీ విద్యార్థులు రెన్యూవల్, ఫ్రెష్ దరఖాస్తులు చేసుకోవాలన్నారు. అర్హుడైన విద్యార్థి పేరు SSC మెమోలో ఉన్న విధంగా ఆధార్ కార్డులో ఉండాలన్నారు. విద్యార్థుల ఆదాయపరిమితి రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు పెంచామని చెప్పారు.