News March 7, 2025

ఆదిలాబాద్: విద్యుత్ వినియోగదారులకు సూచనలు

image

ఇటీవల కొంతమంది వ్యక్తులు మీటర్ తిరగకుండా చేస్తామని వినియోగదారుల వద్దకు వచ్చి డబ్బులు తీసుకొని మీటర్‌లోని కొన్ని వైర్లను కట్ చేసి ప్రజలను మోసం చేస్తున్నారని ఆదిలాబాద్ V&APTS సీఐ ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, ఇలా చేయడం విద్యుత్ శాఖ పరంగా, చట్ట రీత్యా నేరంగా పరిగణించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు అలాంటి వ్యక్తులను నమ్మి మోసపోవద్దని సూచించారు.

Similar News

News October 19, 2025

ఇంద్రవెల్లి: దండారీ ఉత్సవాలు పాల్గొన్న ADB ఎస్పీ

image

ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలు గొప్పవని ఆదిలాబాద్‌ జిల్లా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ పేర్కొన్నారు. ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా దండారీ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఏత్మాసూర్‌పెన్‌కు ఆదివాసీలు సంప్రదాయ పూజలు చేశారు. అదివారం ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌లో ఏర్పాటు చేసిన గుస్సాడీ దండారీ ఉత్సవాలకు జిల్లా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌, ఉట్నూర్ ప్రసాద్ హాజరయ్యారు. గుస్సాడీలతో కలసి కోలాటం ఆడుకున్నారు.

News October 19, 2025

దీపావళి శాంతియుతంగా జరుపుకోండి: ADB కలెక్టర్

image

దీపావళి వెలుగుల పండుగగా ప్రతి ఇంటిలో ఆనందం, ఐకమత్యం, సంతోషం నిండాలని ఆకాంక్షించారు. గిరిజనుల సాంప్రదాయ పండుగ దండారి గుస్సాడి సందర్భంగా గిరిజన సోదరులు, కళాకారులకు కలెక్టర్ రాజర్షి షా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ పండుగలను శాంతి, ఐకమత్యం, సోదరభావంతో జరుపుకోవాలని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

News October 19, 2025

ADB: చివరి రెండు రోజులు పోటెత్తారు!

image

మద్యం షాపుల నిర్వహణకు దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలకు పెంచడంతో జిల్లాలో ఈసారి 711 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. గతంలో 1047 వచ్చినా, ఫీజు పెంపుతో ప్రభుత్వానికి రూ.21.33 కోట్ల ఆదాయం సమకూరింది. గతంతో పోలిస్తే రూ.39లక్షలు ఎక్కువ. ఉట్నూర్ ఎసైజ్ స్టేషన్ పరిధిలో 39వ షాపునకు అత్యధికంగా 25 దరఖాస్తులు వచ్చాయి. 9 షాపులకు రీ-టెండర్ అవకాశం ఉండగా, 3రోజుల క్రితం100లోపే దరఖాస్తులుండగా.. చివరి 2 రోజుల్లో భారీగా వచ్చాయి.