News March 7, 2025
ఆదిలాబాద్: విద్యుత్ వినియోగదారులకు సూచనలు

ఇటీవల కొంతమంది వ్యక్తులు మీటర్ తిరగకుండా చేస్తామని వినియోగదారుల వద్దకు వచ్చి డబ్బులు తీసుకొని మీటర్‌లోని కొన్ని వైర్లను కట్ చేసి ప్రజలను మోసం చేస్తున్నారని ఆదిలాబాద్ V&APTS సీఐ ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, ఇలా చేయడం విద్యుత్ శాఖ పరంగా, చట్ట రీత్యా నేరంగా పరిగణించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు అలాంటి వ్యక్తులను నమ్మి మోసపోవద్దని సూచించారు.
Similar News
News March 21, 2025
10TH విద్యార్థులకు ALL THE BEST : కలెక్టర్

రేపటి నుండి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్ధులకు కలెక్టర్ రాజర్షి షా ఆల్ ద బెస్ట్ తెలిపారు. పరీక్షలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశామన్నారు. ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా అత్యంత జాగ్రత్తగా ఈ పరీక్షలను నిర్వహించాలన్నారు. పరీక్షా కేంద్రాలకు సెల్‌ఫోను అనుమతి లేదని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద మెడికల్ క్యాంప్, ఆన్ని సౌకర్యాలు కల్పించమన్నారు.
News March 21, 2025
ADB: ప్రజలు భగీరథ నీరు తాగాలి :కలెక్టర్

ADB జిల్లాలోని మారుమూల ప్రాంతాల గ్రామ ప్రజలు మిషన్ భగీరథ నీటిని తాగాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు శుద్ధమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ నీరు ప్రతి గ్రామానికి అందుబాటులో ఉందన్నారు. జిల్లా గ్రామస్థులు ఈ నీటిని సురక్షితంగా తాగవచ్చన్నారు. దీని ద్వారా వేసవిలో నీటి సమస్యలు రాకుండా ఉంటాయని పేర్కొన్నారు.
News March 20, 2025
ఆదిలాబాద్ జిల్లాకు ఎల్లో అలెర్ట్.. మూడ్రోజులు వర్షాలు

రానున్న మూడు రోజులు ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గినా.. తర్వాత మళ్లీ పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఎండవేడితో అల్లాడుతున్న ప్రజలకు ఇది కాస్త ఉపశమనం చేకూర్చనుంది. కానీ చేతికొస్తున్న పంటలకు నష్టం జరిగే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.