News February 27, 2026

ఆదిలాబాద్‌ విమానాశ్రయానికి అదనపు భూసేకరణ

image

ADB విమానాశ్రయ నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. సైనిక అవసరాలతో పాటు పౌర విమానయానానికి అనుకూలంగా మార్చడంతో 3KM రన్‌వే కోసం అదనంగా 249.80 ఎకరాల భూసేకరణ అనివార్యమైంది. దీనిపై అధికారులు రైతులతో చర్చలు జరిపి త్వరలోనే ప్రధానమంత్రి చేతులమీదుగా శంకుస్థాపన చేయించాలని ఎంపీ, ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఈ మేరకు పనులు వేగముందు చేయాలని కలెక్టర్‌ను కోరారు. త్వరలో ఉమ్మడి జిల్లా వాసుల విమాన ప్రయాణ కల సాకారం కానుంది.

Similar News

News April 15, 2026

ఖమ్మం: కళ తప్పిన జంట నగరాలు

image

వేలాది కార్మికులతో కళకళలాడిన కొత్తగూడెం, పాల్వంచ నగరాలు నేడు కళావిహీనంగా మారాయి. సింగరేణి గనుల మూత, కేటీపీఎస్‌ పాతప్లాంటు తొలగింపుతో కార్మికులు ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యారు. దీని ప్రభావం వర్తక, రియల్ ఎస్టేట్ రంగాలపై పడి వ్యాపారాలు కుదేలయ్యాయి. కార్పొరేషన్‌గా ఏర్పడినా అభివృద్ధి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో స్థానికులు వాపోతున్నారు. జిల్లాలో కొత్త ప్రాజెక్టుల ప్రకటన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.

News April 15, 2026

నల్గొండ: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

image

హాలియాలో పోలీసులు వ్యభిచార ముఠా గుట్టురట్టు చేశారు. ఒక నివాస గృహంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారంతో మంగళవారం మెరుపు దాడి నిర్వహించారు. ఈ సోదాల్లో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడిని అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ వ్యవహారంలో ఇంకా ఎవరి పాత్ర ఉందనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.