News October 31, 2024

ఆదిలాబాద్: శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

image

కార్తిక మాసాన్ని పురస్కరించుకుని శైవ క్షేత్రాలను సందర్శించాలనుకునే భక్తుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ RM సోలోమన్ పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని డిపోల నుంచి వేములవాడకు, తమిళనాడులోని అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసేందుకు బస్సులు నడుపుతామని పేర్కొన్నారు. అరుణాచలం గిరి ప్రదక్షిణలకు వెళ్లే భక్తులు ఆన్‌లైన్లో బుకింగ్ చేసుకోవాలని సూచించారు. ఈ సేవలు వినియోగించుకోవాలని కోరారు.

Similar News

News October 23, 2025

వయోవృద్ధులకు సేవ చేయడమే నిజమైన పూజ: కలెక్టర్

image

బోరిగామ జడ్పీఎస్‌ఎస్‌లో ‘ఆరోగ్య పాఠశాల’లో భాగంగా, ‘హెల్ప్‌ ఏజ్‌ ఇండియా’ నిర్వహించిన ‘గ్రాండ్‌ పేరెంట్స్‌ పాద పూజ’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. వయోవృద్ధులకు సేవ చేయడమే నిజమైన పూజ అన్నారు. అనంతరం వృద్ధుల సంక్షేమం, సమస్యల పరిష్కారంపై జరిగిన వర్క్‌షాప్‌లో మాట్లాడారు. ఈ కార్యక్రమాలలో డీడబ్ల్యూఓ మిల్కా, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

News October 23, 2025

ఆదిలాబాద్ TO అరుణాచలానికి RTC బస్సు

image

ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో నుంచి తమిళనాడు అరుణాచలం గిరిప్రదక్షిణకు సూపర్ లగ్జరీ బస్సు సౌకర్యం కల్పించినట్లు ఆర్టీసీ డీఎం ప్రతిమా రెడ్డి తెలిపారు. ఈ బస్సు నవంబర్ 8న బయలుదేరి కాణిపాకం, వెల్లూరు గోల్డెన్ టెంపుల్, అరుణాచలం గిరి ప్రదక్షిణ పూర్తి చేస్తుంది. తిరిగి వచ్చేటప్పుడు జోగులాంబ దేవాలయం చూసుకొని నవంబర్ 11న రాత్రి 10 గంటలకు ఆదిలాబాద్ చేరుకుంటుందన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

News October 22, 2025

ADB: పత్తి రైతులకు శుభవార్త

image

పత్తి రైతులకు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ శుభవార్త చెప్పింది. ఈనెల 27 నుంచి పత్తి కొనుగోలు ప్రారంభించనున్నట్లు పేర్కొంది. పంట విక్రయించే రైతులు కచ్చితంగా కిసాన్ కపాస్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. స్లాట్ బుకింగ్ ఈనెల 24 నుంచి అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. నాణ్యమైన 8 శాతంలోపు తేమతో కూడిన పత్తి తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర 8110 పొందాలని పేర్కొన్నారు.