News July 30, 2024
ఆదిలాబాద్: సబ్మిషన్‌కు రేపే LAST

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో PG మొదటి, రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు అసైన్మెంట్ సబ్మిషన్ గడువు ఈనెల 31న ముగుస్తుందని ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి తమ అసైన్మెంట్లు యూనివర్సిటీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. అసైన్మెంట్లు పూర్తి చేసిన అనంతరం బుధవారంలోపు సబ్మిట్ చేయలని సూచించారు.
Similar News
News December 17, 2025
ఒక్క ఓటుతో మూత్నూర్ తండా సర్పంచ్‌గా జాదవ్ రాంజీ

గుడిహత్నూర్ మండలంలోని మూత్నూర్ తండా గ్రామ సర్పంచ్‌గా జాదవ్ రాంజీ నాయక్ విజయం సాధించారు. సమీప అభ్యర్థిపై 1 ఓటు తేడాతో గెలుపొందారు. ప్రజల సమస్యల పరిస్కారానికి తన వంతు కృషి చేస్తూ.. ప్రతి క్షణం అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.
News December 17, 2025
ADB: ‘కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమాన్ని విజయవంతం చేయండి’

ఈనెల 18వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమంను విజయవంతం చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ కోరారు. ఆశ కార్యకర్తతో కూడిన బృందం ఈ ఉద్యమంలో భాగంగా ప్రతి ఇంటిని సందర్శించి అందరిని పరీక్షించనున్నట్లు తెలిపారు. జిల్లాలో 1002 బృందాలు ఈ సర్వేలో పాల్గొంటున్నాయని పేర్కొన్నారు. ప్రజలు అందరు తమ ఇంటికి వచ్చే సర్వే బృందాలకు సహకరించాలని కోరారు.
News December 17, 2025
ఆదిలాబాద్ జిల్లాలో మొదటి విజయం మహిళదే

మూడో విడత స్థానిక ఎన్నికల్లో భాగంగా తలమడుగు మండల పరిధిలోని 22 గ్రామ పంచాయతీల్లో బుధవారం సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పల్లి-కే సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గుమ్ముల లక్ష్మి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి తొడసం రుక్మా బాయిపై 39 ఓట్ల తేడాతో గెలుపొందారు. 29 గ్రామ పంచాయతీలు ఉండగా.. 7 ఏకగ్రీవం అయ్యాయి.


