News April 7, 2025

ఆదిలాబాద్: ‘సమగ్ర సర్వే నిధులు విడుదల చేయాలి’

image

సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన ఎనిమిరేటర్ సూపర్వైజర్ కంప్యూటర్ ఆపరేటర్లకు తక్షణమే నిధులు వారి అకౌంట్లో జమా చేయాలని టీజీటీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రవీందర్ జాధవ్ కోరారు. ఈ విషయమై సోమవారం సీపీఓ ను కలిసి నిధులు విడుదల చేయాలని వినతిపత్రం సమర్పించారు. సర్వే చేసి నేటికీ ఆరు నెలలు గడుస్తున్న ప్రభుత్వం నేటికీ నిధులు విడుదల చేయకపోవడం శోచనీయమన్నారు. ఈ నిధులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Similar News

News April 23, 2025

MNCL: జిల్లాలో విషాదం.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

image

మంచిర్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. లక్షెట్టిపేటలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని సుస్మిత (16) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్ష ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని మనస్తాపం చెంది ఉరేసుకుందన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 23, 2025

సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటిన ADB బిడ్డ

image

UPSC సివిల్స్ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా యువకుడు ఆదా సందీప్ సత్తా చాటాడు. ఇంటెలిజెన్స్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న వెంకటేష్-వాణి దంపతుల చిన్న కుమారుడు సందీప్ సివిల్స్ ఫలితాల్లో 667 ర్యాంక్ సాధించాడు. గతంలో తొలి ప్రయత్నంలో 830 ర్యాంక్ సాధించాడు. అదే పట్టుదలతో మళ్లీ పరీక్ష రాసి ఇప్పుడు 667 ర్యాంక్ సాధించడంతో కుటుంబీకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పలువురు సందీప్‌ను అభినందించారు.

News April 23, 2025

9 నుంచి 27 ర్యాంక్‌కు పడిపోయిన ADB జిల్లా

image

ఇంటర్ ఫలితాలు వెలువడ్డాయి. ADB జిల్లాలో ఫస్టియర్ 9,106 మంది పరీక్షలు రాయగా 4,967 మంది పాసయ్యారు. సెకండియర్‌లో 8,890కి 6,291 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం ఫస్టియర్‌లో 54.55, సెకండియర్‌లో 70.76గా నమోదైంది. ఫస్టియర్‌లో రాష్ట్రంలో జిల్లా గతేడాది 9వ స్థానంలో ఉండగా.. ఈసారి 27వ స్థానంలో నిలిచింది. సెకండియర్ గతేడాది 13వ ప్లేస్‌లో ఉండగా ఈసారి 12వ స్థానంలో నిలిచింది.

error: Content is protected !!