News December 7, 2024
ఆదిలాబాద్: ‘సోమవారం నుంచి ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రారంభించాలి’
వచ్చే సోమవారం నుండి ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రారంభించాలని, గడువులోగా పూర్తి చేయాలనీ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం కలెక్టరేట్ లో ఇందిరమ్మ ఇళ్ల సర్వే పై గూగుల్ మీట్ ద్వారా సంబంధిత అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారుల గుర్తింపు కోసం ప్రభుత్వం రూపొందించిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్ యాప్ ద్వారా సర్వే నిర్వహించాల్సిన విధానంపై దిశానిర్దేశం చేశారు.
Similar News
News January 17, 2025
దిలావర్‌పూర్: అటవీ ప్రాంతంలో భార్యాభర్తల SUICIDE
ఇద్దరు భార్యాభర్తలు ఉరేసుకొని మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కాల్వ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అటవీ ప్రాంతంలో శుక్రవారం చోటు చేసుకుంది. సారంగాపూర్ మండలం చించోలి గ్రామానికి చెందిన భార్యాభర్తలు ఒకే చెట్టుకు ఉరేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. స్థానిక ఎస్సై సందీప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 17, 2025
మందమర్రి: కారుణ్య నియామకాలతో 1806 కొలువులు
మందమర్రి ఏరియాలో నూతనంగా ఉద్యోగాలు పొందిన 8 మంది డిపెండెంట్లకు జీఎం దేవేందర్ గురువారం నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏరియాలో ఇప్పటివరకు కారుణ్య నియామకాల ద్వారా 1806 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. నూతన కార్మికులు క్రమం తప్పకుండా విధులకు హాజరై అధిక బొగ్గు ఉత్పత్తికి కృషి చేయాలని కోరారు. కష్టపడి పనిచేసి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.
News January 17, 2025
ఉట్నూర్: గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల ఉద్యోగాలకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రతాప్ సింగ్ తెలిపారు. హిస్టరీ, ఎకనామిక్స్, కామర్స్ సబ్జెక్టులలో ఒక్కో పోస్టు ఖాళీగా ఉందన్నారు. పీజీలో 55% ఉత్తీర్ణత కలిగి ఉండి నెట్, సెట్ అర్హత ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. అర్హులైన వారు ఈనెల 20 తేదీలోపు కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.