News March 29, 2025
ఆదిలాబాద్: స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోండి

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన SC విద్యార్థులకు 2025 విద్యా సంవత్సరానికి గాను విదేశాల్లో ఉన్నత విద్యనూ అభ్యసించేందుకు ‘అంబేడ్కర్ ఓవర్సీస్ విద్య నిధి” పథకం ద్వారా స్కాలర్షిప్ కోసం దరఖాస్తులు చేసుకోవాలని SC సంక్షేమ శాఖ అధికారి సునీత పేర్కొన్నారు. ఈనెల 20 నుంచి మే 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 88869 76630 నంబర్ను సంప్రదించాలని కోరారు.
Similar News
News November 12, 2025
ADB: పాఠశాల మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో మంజూరైన పనులను గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మంగళవారం అర్బన్, రూరల్, మావల, ఇచ్చోడ మండలాల్లోని పనుల పురోగతిపై ఆయన సమీక్షించారు. విద్యుత్తు, తాగునీరు, మరుగుదొడ్లు, కిచెన్ షెడ్లు, ప్రహరీ గోడలు సహా తరగతి గదుల మరమ్మత్తులపై చర్చించి, పనుల్లో జాప్యం చేయవద్దని సూచించారు.
News November 11, 2025
సజావుగా సాగుతున్న పంటల కొనుగోళ్ల: ADB కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి, సోయా, మొక్కజొన్న కొనుగోళ్ల కేంద్రాలు ప్రారంభమై కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. వరి, పత్తి, సోయా కొనుగోళ్లపై మంత్రులు ఉత్తం కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ రామకృష్ణారావు కలిసి నిర్వహించిన కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో 11 పత్తి కొనుగోలు కేంద్రాలు, 33 జిన్నింగ్ మిల్లులు ద్వారా కొనుగోళ్లు ప్రారంభమయ్యాయన్నారు.
News November 10, 2025
ఆదిలాబాద్: సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలి: ఎస్పీ

ఆదిలాబాద్ పట్టణంలోని పోలీసు ముఖ్య కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల రోజును ఎస్పీ అఖిల్ మహాజన్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు ఎస్పీని నేరుగా కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. సమస్యలను విన్న ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలిచ్చారు. బాధితుల సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ప్రతి ఒక్క సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చూపాలన్నారు.


