News April 13, 2025
ఆదిలాబాద్: 100వ పుట్టిన రోజు చేసుకున్న వృద్ధురాలు

ఓ వృద్ధురాలి వందేళ్ల పుట్టినరోజును ఆ కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఆదిలాబాద్‌లోని యాదవ సంఘ భవనంలో సరస్వతివార్ రుకుంబాయి 100వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కుమార్తెలు, కుమారులు, మనమళ్లు, మనుమరాళ్లతో కలిసి దాదాపు 100 మంది కుటుంబీకుల మధ్య కేక్ కట్ చేశారు.
Similar News
News December 9, 2025
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి.. మంత్రి విచారం వ్యక్తం

నగరి(M) తడుకుపేట సమీపంలో రెండు కార్లు ఢీకొని తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ పోటు కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి మండిపల్లి స్పందించారు. ఘటన బాధాకరమని, సంతాపం వ్యక్తం చేశారు. రోడ్డు భద్రతపై ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
News December 9, 2025
పెళ్లి రద్దు చేసుకున్న హీరోయిన్?

వ్యాపారవేత్త రాజ్‌హిత్ ఇబ్రాన్‌తో హీరోయిన్ నివేదా పేతురాజ్ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వీరి వివాహం రద్దయినట్లు ప్రచారం జరుగుతోంది. తన ఇన్‌స్టా అకౌంట్ నుంచి ఎంగేజ్మెంట్ పోస్ట్‌ను తొలగించడం, ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఇటీవలే క్రికెటర్ స్మృతి మంధాన వివాహం కూడా ఎంగేజ్మెంట్ తర్వాత రద్దయింది.
News December 9, 2025
వాజ్‌పేయి పాలసీలతో అభివృద్ధికి పునాది: CM

AP: ఈనెల 11-25 మధ్య జరిగే ‘అటల్ సందేశ్.. మోదీ సుపరిపాలన యాత్ర’లో కూటమి నేతలంతా పాల్గొనాలని CM CBN సూచించారు. వాజ్‌పేయి సుపరిపాలనకు నాంది పలికారని, ఆయన పాలసీలతోనే దేశాభివృద్ధికి పునాది పడిందని చెప్పారు. రోడ్లు, విమానయాన, టెలీ కమ్యూనికేషన్ రంగాల్లో సంస్కరణలు తెచ్చారన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి వెంటనే స్పందించేవారన్నారు. PM మోదీ దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నారని కొనియాడారు.


