News April 13, 2025

ఆదిలాబాద్‌: 100వ పుట్టిన రోజు చేసుకున్న వృద్ధురాలు

image

ఓ వృద్ధురాలి వందేళ్ల పుట్టినరోజును ఆ కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఆదిలాబాద్‌లోని యాదవ సంఘ భవనంలో సరస్వతివార్ రుకుంబాయి 100వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కుమార్తెలు, కుమారులు, మనమళ్లు, మనుమరాళ్లతో కలిసి దాదాపు 100 మంది కుటుంబీకుల మధ్య కేక్ కట్ చేశారు. 

Similar News

News April 11, 2026

ఖాజీపేటలో కీర్తన హత్య.. విస్తుపోయే విషయాలు

image

కడప(D)లో శుక్రవారం విద్యార్థిని హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు వెంకటేశ్ డిగ్రీ చదువుతూ.. ఇంటర్ చదువుతున్న కీర్తనను ప్రేమపేరుతో బెదిరించేవాడు. విషయం తెలుసుకున్న బంధువులు ఇద్దరిదీ ఒకే కులం.. పైగా <<19614640>>వరుసకు అన్న<<>> అవుతావని హెచ్చరించారు. కాగా ఏడాదిగా దూరంగా ఉన్న వెంకటేశ్ నిన్న స్నేహితుడు ప్రవీణ్‌తో కలిసి కీర్తన ఇంటికి వచ్చి ఆమె గొంతుకోసి పరారయ్యాడు.

News April 11, 2026

KGBV దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు

image

AP: రాష్ట్రంలోని 352 KGBVల్లో చేరేందుకు దరఖాస్తు గడువును మరోసారి పొడిగిస్తున్నట్లు SPD శ్రీనివాసరావు తెలిపారు. నిన్నటితో గడువు ముగియగా పేరెంట్స్ వినతి మేరకు ఈనెల 20వ తేదీ వరకు పొడిగించామన్నారు. 6, 11 తరగతుల్లో ప్రవేశాలతో పాటు మిగతా తరగతుల్లో మిగిలిపోయిన అడ్మిషన్లకు అప్లికేషన్లు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 32,079 సీట్లకు గానూ నిన్నటి వరకు 69,362 దరఖాస్తులు వచ్చాయని ఆయన వెల్లడించారు.

News April 11, 2026

‘బెస్ట్ మహిళా ఇంజినీరింగ్ ప్రొఫెసర్’గా కళ్యాణి రాధా

image

అనంతపురం జేఎన్టీయూ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ కళ్యాణి రాధా ‘బెస్ట్ మహిళా ఇంజినీరింగ్ ప్రొఫెసర్’ అవార్డు అందుకున్నారు. శుక్రవారం టెక్కలిలో జరిగిన ఏపీ ISTE రాష్ట్ర సదస్సులో ఈమె ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఆమె మెకానికల్ విభాగాధిపతిగా, కళాశాల NSS ప్రోగ్రాం ఆఫీసర్‌గా సేవలందిస్తున్నారు.