News February 28, 2025
ఆదిలాబాద్: 2019లో 59.03%.. 2025లో 70.42%

ఉమ్మడి ADB, NZB, KNR, MDK పట్టభద్రులు, ఉపాధ్యాయ MLC ఎన్నికల పోలింగ్ నిన్న జరగగా.. మార్చి 3న కరీంనగర్‌లో లెక్కింపు జరగనుంది. అయితే, 2019లో పట్టభద్రుల పోలింగ్ 59.03శాతం నమోదు కాగా, 2025లో 70.42 శాతం నమోదైంది. ఉపాధ్యాయ పోలింగ్ 2019లో 83.54శాతం నమోదు కాగా, 2025లో 91.90శాతం పోలింగ్ జరిగింది. 2019 ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రుల పోలింగ్ 11.39శాతం, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ 8.36 శాతం పెరిగింది.
Similar News
News March 17, 2025
కర్నూలు జిల్లా TODAY TOP NEWS

➤కర్నూలు: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్
➤ఆదోనిలో ‘గరివిడి లక్ష్మి’ సినిమా షూటింగ్
➤పొట్టి శ్రీరాములు జీవిత చరిత్ర అనుసరణీయం: మంత్రి భరత్
➤తోటి డ్రైవర్‌కు అండగా నిలిచిన ఆటో యూనియన్
➤ఆదోని: ‘గొంతు ఎండుతోంది సారూ.. మా కష్టాలు తీర్చండి’
➤ఒత్తిడిని అధిగమించి పరీక్షలు రాయాలి: MP
➤పెద్దకడుబూరు: పులికనుమ రిజర్వాయర్లో వ్యక్తి గల్లంతు?
➤మంత్రాలయం: ఉరి వేసుకొని వ్యక్తి మృతి
News March 17, 2025
డిగ్రీ మహిళా కళాశాల ప్రిన్సిపల్ అరెస్ట్

కదిరి అమృతవల్లి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వెంకటపతిని అరెస్ట్ చేసినట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు. వెంకటపతికి కౌన్సిలింగ్ ఇచ్చి కోర్ట్‌లో హాజరు పరిచినట్లు సీఐ తెలిపారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు. అమృతవల్లి మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో సదరు కాలేజి ప్రిన్సిపల్ వెంకటపతి విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు సీఐ తెలిపారు.
News March 16, 2025
KKRకు బిగ్ షాక్

ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. గాయం కారణంగా ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ఈ సీజన్‌కు దూరమయ్యారు. ఆయన స్థానంలో చేతన్ సకారియాను భర్తీ చేయనున్నారు. చేతన్‌కు KKR రూ.75 లక్షలు చెల్లించనుంది. ఇప్పటివరకు 19 మ్యాచులు ఆడిన సకరియా 20 వికెట్లు తీశారు.