News May 3, 2024

ఆదిలాబాద్: 2019 ఎన్నికల్లో వచ్చిన ఓట్ల వివరాలు!

image

ADB పార్లమెంట్‌లో 3 ప్రధానపార్టీలు ఆదివాసీలకు టికెట్లు కేటాయించాయి. నియోజకవర్గంలో 16.50 లక్షల ఓటర్లు ఉన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను చూస్తే BJP సోయంకు 3,77,374 ఓట్లు రాగా, BRS గోడం నగేశ్‌కు 318,814 ఓట్లు వచ్చాయి, కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన రాథోడ్ రమేష్‌కి 3,14,238 ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం నగేశ్, రమేశ్ ఒకే గొడుగు కింద రావడంతో సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని చూస్తున్నారు.

Similar News

News October 18, 2025

పత్తి కొనుగోళ్లు, కౌలు రైతు నమోదుపై ADB కలెక్టర్ సమీక్ష

image

జిల్లాలో పత్తి కొనుగోళ్లు, కౌలు రైతుల నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పత్తి కొనుగోళ్లు, కౌలు రైతుల నమోదు, క్రాప్ బుకింగ్, పంట నష్టం అంచనాలపై వ్యవసాయ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

News October 17, 2025

ADB: డబ్బులు వసూలు చేసిన ప్రిన్సిపల్ రిమాండ్

image

ఉద్యోగం ఇప్పిస్తానని నిరుద్యోగులను నమ్మించి డబ్బులు వసూలు చేసిన బోథ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ కోవ విఠల్‌ను అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించినట్లు ఆదిలాబాద్ టూటౌన్‌ సీఐ నాగరాజు తెలిపారు. అనంతా సొల్యూషన్‌ సంస్థ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగం ఇప్పిస్తానని 45 మంది నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.లక్షల్లో వసూలు చేసినట్లు పేర్కొన్నారు. ఓ నిరుద్యోగి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

News October 16, 2025

ఆదిలాబాద్ ఇన్‌ఛార్జ్ డీపీఆర్ఓగా విష్ణువర్ధన్

image

ఆదిలాబాద్ ఇన్‌ఛార్జ్ జిల్లా పౌర సంబంధాల అధికారి (డిపిఆర్ఓ)గా ఎల్చల విష్ణువర్ధన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ రాజార్షి షాను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. కలెక్టర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా పౌర సంబంధాల విభాగం పనితీరు మరింత ప్రభావవంతంగా ఉండేలా కృషి చేయాలని సూచించారు.