News March 20, 2025
ఆదిలాబాద్: 22న యువజన ఉత్సవ పోటీలు

ADB ప్రభుత్వ డిగ్రీ కళాశాల (సైన్స్)లో మార్చ్ 22న జిల్లాస్థాయి యువజన ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ జే.సంగీత, నెహ్రూ యువజన కేంద్ర జిల్లా కోఆర్డినేటర్ సుశీల్ బడ్ ప్రకటనలో పేర్కొన్నారు. పోటీల్లో 15-29 వయసున్న డిగ్రీ చదివినా లేదా చదువుతున్న యువతీ యువకులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. పెయింటింగ్, మొబైల్ ఫొటోగ్రఫీ, కవితా రచన, ఉపన్యాసం, సాంస్కృతిక నృత్య విభాగంలో పోటీలు ఉంటాయన్నారు.
Similar News
News November 9, 2025
ఆదిలాబాద్: రేపు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు

ఆదిలాబాద్లోని ఐపీ స్టేడియంలో సోమవారం అస్మిత అథ్లెటిక్స్ లీగ్ (2025-26) జిల్లాస్థాయి ఎంపిక పోటీలను నిర్వహించనున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజా రెడ్డి తెలిపారు. అండర్ 14, 16 విభాగాల్లో బాలికలకు ఎంపిక పోటీలు ఉంటాయన్నారు. ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. మరిన్ని వివరాలకు 94921 36510 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
News November 9, 2025
ADB: రద్దీ దృష్ట్యా పలు రైళ్లకు అదనపు కోచ్లు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు రైళ్లకు అదనపు కోచ్లు అందుబాటులోకి తెచ్చినట్లు డివిజన్ ప్రజా సంబంధాల అధికారి రాజేష్ షిండే తెలిపారు. నాందేడ్- మన్మాడ్- నాందేడ్ ప్యాసింజర్, పూర్ణ- ఆదిలాబాద్ రైళ్లకు ఆదివారం నుంచి అదనపు కోచ్లు ఉంటాయి. ఆదిలాబాద్- పర్లి ప్యాసింజర్, వైజ్నాథ్- అకోలాకు ఈ నెల 10 నుంచి, అకోలా-పూర్ణ, పర్లివైజ్నాథ్- పూర్ణ రైళ్లకు ఈ నెల 11 నుంచి కోచ్లు అందుబాటులోకి వస్తాయన్నారు.
News November 8, 2025
తాంసి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన SP

వార్షిక తనిఖీల్లో భాగంగా ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం తాంసి పోలీస్ స్టేషన్ను సందర్శించారు. స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరును పరిశీలించారు. బాధితుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ, ఫిర్యాదుదారుల సమస్యలను త్వరగా పరిష్కరించే విధంగా పనిచేయాలని సిబ్బందికి సూచించారు. పోలీసు గౌరవ ప్రతిష్టలు పెంచేలా విధులు నిర్వహించాలన్నారు. నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.


