News April 4, 2024
ఆదిలాబాద్: 3.55 లక్షల మందికి జీరో బిల్

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల్లో గృహజ్యోతి పతకానికి సంబంధించిన అర్హులకు మొదటి నెల జీరో బిల్లులను జారీ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తంలో 8.14 విద్యుత్ కనెక్షన్లు ఉండగా.. 3.55 లక్షల మంది 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించినట్లు గుర్తించారు. దీంతో మార్చి నెలలో 3.45 లక్షల మందికి రూ.9.38 కోట్ల రాయితీతో జీరో బిల్లులను అందించారు.
Similar News
News March 3, 2025
ఆదిలాబాద్: యథావిధిగా ప్రజావాణి కార్యక్రమం

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 3న సోమవారం యథావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు.
News March 3, 2025
ఆదిలాబాద్: జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

వేసవి ప్రారంభంలోనే జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరగడంతో ఉక్కపోతతో జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఆదివారం బేల మండలంలో 36.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండలో నుంచి ఉపశమనం పొందేందుకు కూలర్లను వినియోగిస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో బయటికి వచ్చేందుకు భయపడుతున్నారు. వచ్చే రెండు మూడు రోజుల్లో మరింత ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
News March 2, 2025
ఆదిలాబాద్: భార్య మందలించిందని భర్త SUICIDE

భార్య మందలించిందని ఓ భర్త పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు 2 టౌన్ ఏఎస్ఐ ముకుంద్ రావు తెలిపారు. మహారాష్ట్ర కిన్వాట్ తాలూకా దైహిలీకు చెందిన నూకల్వర్ ఓం ప్రకాశ్(35) మద్యానికి బానిస అయ్యాడు. ముగ్గురు పిల్లలు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుందని భార్య మందలించింది. దీంతో శనివారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు రిమ్స్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.